తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు దుర్గా మాత ఉత్సవాలు ప్రతీకలు:

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:39
Durga Mata festivals are symbols of Telangana culture and traditions:

మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి),..//తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు దుర్గా మాత ఉత్సవాలు ప్రతీకలు అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  అన్నారు.హుజూర్ నగర్ మండల పరిధిలోని అమరవరం గ్రామంలో  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గాల హయాంలో దసరా పండుగ ప్రాచుర్యం కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ దసరా పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగ మహిళల పండుగని ప్రభుత్వం మహిళలకు తో బుట్టువుగా ఉంటూ పండుగకు చీరలు కానుకలు పంపిణీ చేస్తోందన్నారు. పండుగలు చెడుపై మంచి సాధించిన విజయాలు అన్నారు.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన  కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  అమరవరం గ్రామ సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి రెడ్డి హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పలసైదిరెడ్డి గ్రామ టిఆర్ఎస్ నాయకులు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.