ఎంపీ ఉత్తమ్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:48
MLA Saidireddy challenged MP Uttam

-మున్సిపల్ లేఅవుట్లకు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలి
-ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా ?
- అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసగిస్తున్న ఎంపీ ఉత్తమ్ 
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): 
మున్సిపల్ లేఅవుట్లకు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలనీ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే లేవుట్ స్థలాలు మొత్తం ఆక్రమణకు గురయ్యాయని నియోజకవర్గ ప్రజలను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోసగిస్తున్నాడని, 2019 ఉప ఎన్నికల కన్నా ముందు హుజూర్ నగర్ సంబంధించి అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కూడా లేఅవుట్ స్థలాలకు ఎందుకు ఫెన్సింగ్ వేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ లేఅవుట్ స్థలాలకు సంబంధించి నిజ, నిజాలు నీగ్గు తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు.  దమ్ముంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మున్సిపల్ లేఅవుట్ల కు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. నెలకు 80 వేల రూపాయలు కాంగ్రెస్ భవన్ నుండి ఆ పార్టీ నాయకులు కిరాయిలు పొందుతున్నారని ఆరోపించారు. అబద్ధపు మాటలు, మోసపు వాగ్దానాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని అన్నారు. లేఔట్ల పేరుతో నియోజకవర్గంలో పిలుపునిచ్చి కనీసం వంద మంది నాయకులతో కూడా ధర్నా చేయలేకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కరపత్రాలు వేసి ప్రజలను రప్పించేందుకు చేసే ప్రయత్నాలు విఫలమైనాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా అబద్ధపు ప్రచారాలతో మోసగించినా ప్రజలు నమ్మరని అన్నారు.