మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:46
MLA who started Maha Annadana program

హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని  హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని 3, 4 వ వార్డు పరిధిలో శ్రీదేవి దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ, ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకవర్గాల హయాంలో దసరా పండుగ ప్రాచుర్యం కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ దసరా పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు.  బతుకమ్మ పండుగ మహిళల పండుగని ప్రభుత్వం మహిళలకు తోబుట్టువుగా ఉంటూ పండుగకు చీరలు కానుకలు పంపిణీ చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, వ్యవసాయ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, నేరేడుచర్ల వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి,  వార్డు ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.