హనుమకొండ

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:16

హనుమకొండ, సెప్టెంబర్19, (ప్రజాజ్యోతి)../ మహా నగరంలో కొనసాగుతున్నఅభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా  పూర్తి చేయాలని జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను బిల్లుల చెల్లింపు నిమిత్తం, కొత్తగా ప్రతిపాదించిన అభివృద్ధి పనులను పరిశీలించారు. 61 డివిజన్ లోని ప్రశాంత్ నగర్, 62 వ డివిజన్లోని మడికొండ ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత రోడ్లు, మురుగుకాలువలను 46 డివిజన్ లోని మడికొండ లో నిర్మించిన కమ్యూనిటీ హల్ ను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని లేనిచో బిల్లులో కోత విధిస్తామని అన్నారు.

అంబేద్కర్ సంఘం 46వ వసంతదినోత్సవాన్ని విజయవంతం* చేయండి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:12

20-09,2022హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి../ ఈరోజు హనుమకొండ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం యొక్క 46వఆవిర్భావ దినోత్సవంv సభను విజయవంతం చేయాల్సిందిగా వరంగల్ జిల్లా యువజన సంఘం కార్యకర్తలు అందరూ కూడా సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటలకు ఆయుర్వేద దినోత్సవం ప్రతి గ్రామ గ్రామాన అంబేద్కర్ గారిని గౌరవిస్తూ పూలమాలతో సంఘ ఆవిష్కరణ సభను ప్రతి సంఘం నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ఆరోజు ఈ సమావేశానికి హాజరవుతారని తెలియజేస్తున్నాను కావున వరంగల్ హనుమకొండ జిల్లా సంఘాల కార్యకర్తలు సభలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ అంబే

ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:14

హనుమకొండ,  సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి) ..జిడబ్లుఎంసి ఆధ్వర్యంలో వివిధ డివిజన్లలో  ప్రతి ఆదివారం 10 గం.లకు 10 ని.ల కార్యక్రమం  స్థానిక కార్పొరేటర్ ల భాగస్వామ్యంతో  యాంటి లార్వా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ల భాగస్వామ్యం తో బల్దియా ప్రజా ఆరోగ్య అధికారులు,మలేరియా సిబ్బంది ఆయా డివిజన్ లలో  ర్యాలీలు చేపట్టి  అంటి లార్వా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులు దూరం అవుతాయని, సీజనల్ వ్యాధుల ను అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి  వివరించారు.

రచయిత, కవుల పాత్ర మరువలేనిది జంగా రాఘవ రెడ్డి

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:12

హనమకొండ‌, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి).. మేధావులు, రచయితలు, కవులు, విద్యావంతులు తెలంగాణ ఉద్యమంలో ప్రథమంగా ముందుండి నడిపిన ఉద్యమ కారుల పాత్ర మరువలేనిదని మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. హన్మకొండ జడ్పీ హాల్ లో రచయిత్రి తెలంగాణ ఓరుగల్లు పోరు బిడ్డ మలిదశ ఉద్యమకారిణి రేపల్లె ఆడబిడ్డ తిరునగరి దేవకి దేవి  పుస్తకాల పరిచయ సభ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంగా హాజరయ్యారు.

ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:42

 హనుమకొండ, సెప్టెంబర్16 (ప్రజాజ్యోతి) . ఈ నెల 19 నుండి 26 వరకు ఖాజిపేట దర్గా ఉర్సు ఉత్సవాలు జరుగనున్న సందర్భంగా శుక్రవారం ఉత్సవాల నిర్వహణ నోడల్ అధికారి అనిసుర్ రషీద్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా నీటి సరఫరా, సరియైన లైటింగ్ ఏర్పాటు తో పాటు సివిల్ పనుల పూర్తి చేసేలా ఆదేశించడం జరిగిందని,అన్ని విభాగాల సిబ్బంది సమన్వయం తో ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.

బాలల సమస్యలు పరిష్కరించుటకే బాల అదాలత్ ఎస్సీపీసీఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:45

హనుమకొండ, సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి).బాలల సమస్యలు పరిష్కరించుటకు బాల అదాలత్ నిర్వహిస్తున్నట్లు  తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎస్సీపిసీఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 21 బుధవారం రోజున నిర్వహించ తలపెట్టిన బాల అదాలత్  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బెంచ్ ఏర్పాటు లో భాగంగా గురువారం రోజున సమీకృత జిల్లా జిల్లా కార్యాలయాల  సముదాయంలోని సమావేశ హాలులో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన నిర్వహించారు.

ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన నాయిని

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 15:41

హనుమకొండ, సెప్టెంబర్15 (ప్రజాజ్యోతి)   వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హనుమకొండ జులైవాడ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. పేద విద్యార్థులకై నాయిని విశాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ మరియు వసుధ ఫౌండేషన్ హైదరాబాద్ వారి తో సమిష్టిగా పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను ఇవ్వడం జరిగిందన్నారు.

దళితుల భూముల కబ్జాలను ప్రోత్సహిస్తున్న రెవెన్యూ, పోలిస్ ల పై చర్యలు తీసుకొవాలి.

Submitted by sridhar on Wed, 14/09/2022 - 18:03

14-09-2022హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి ; దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన దళితుడైన బిక్షపతి భూమిని కబ్జా చేసిన ఎఇ ని ప్రొత్సహించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దామెర తహసీల్దారు, ఎస్.ఐ తదితరుల పై ఎస్సీ ఎస్టీ  అట్రాసిటి చట్టం సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేసి,సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్,డిబిఎఫ్ అధ్వర్యంలో బుధవారం నాడు కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్ సిలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్ లో నిర్వహించినతెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం పకడ్బందీ అమలు చేయాలని డిమాండ్

నీట్ పరీక్షలో రాణించిన పోలీస్ హోంగార్డ్ తనయుడు

Submitted by veerareddy on Wed, 14/09/2022 - 16:39

హనుమకొండ‌, సెప్టెంబర్14 (ప్రజాజ్యోతి). ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో రాణించిన హోంగార్డ్ కుమారుడి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి బుధవారం సత్కరించారు. వివరాల్లోకి వెలితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోంగార్డ్ విధులు నిర్వహిస్తున్న మార్గం శ్యాం కుమారుడు మార్గం మణికంఠ ఇటీవల ప్రకటించిన నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 720 మార్కులకు గాను 646 మార్కులు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకంటూ ఒక సీటును గ్యారేంటీ చేసుకున్నాడు.