ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:14
Every Sunday at 10 hours and 10 minutes

హనుమకొండ,  సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి) ..జిడబ్లుఎంసి ఆధ్వర్యంలో వివిధ డివిజన్లలో  ప్రతి ఆదివారం 10 గం.లకు 10 ని.ల కార్యక్రమం  స్థానిక కార్పొరేటర్ ల భాగస్వామ్యంతో  యాంటి లార్వా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ల భాగస్వామ్యం తో బల్దియా ప్రజా ఆరోగ్య అధికారులు,మలేరియా సిబ్బంది ఆయా డివిజన్ లలో  ర్యాలీలు చేపట్టి  అంటి లార్వా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులు దూరం అవుతాయని, సీజనల్ వ్యాధుల ను అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి  వివరించారు. విస్తృతం గా  వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణం లో దోమలు, ఈగ ల ద్వారా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టడానికి ప్రజలు తమ  ఇంటి ఆవరణలో ఉండే చెత్త కుండీలు, డబ్బాలు, టైర్లు కూలర్ లు, కొబ్బరి చిప్పలలో నీటిని నిల్వ ఉండకుండా చూడాలని, ఇంట్లో నీరు నిల్వవుంచుకునే పాత్రలపై  మూతలు ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ  కరపత్రాలు అందజేసి,సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముద్రించిన  స్టిక్కర్ లను గృహాలకు సిబ్బంది అంటించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ మరుపల్ల రవి, ఎం.హెచ్.ఓ.డా.రాజేష్, సానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య, డివిజన్ ప్రత్యేక అధికారులు, ఆర్ ఐ లు, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.