దళితుల భూముల కబ్జాలను ప్రోత్సహిస్తున్న రెవెన్యూ, పోలిస్ ల పై చర్యలు తీసుకొవాలి.

Submitted by sridhar on Wed, 14/09/2022 - 18:03
Actions should be taken against the revenue and police who are encouraging the grabbing of Dalit lands.

14-09-2022హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి ; దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన దళితుడైన బిక్షపతి భూమిని కబ్జా చేసిన ఎఇ ని ప్రొత్సహించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దామెర తహసీల్దారు, ఎస్.ఐ తదితరుల పై ఎస్సీ ఎస్టీ  అట్రాసిటి చట్టం సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేసి,సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్,డిబిఎఫ్ అధ్వర్యంలో బుధవారం నాడు కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్ సిలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్ లో నిర్వహించినతెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం పకడ్బందీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ అత్యాచార లకు గురైన బాధితులను న్యాయం జరిగె వరకు అండగా నిలవలన్నారు.నిందితులను కఠినంగా శిక్షించే వరకు  ఐక్యంగా ఉద్యమించాలన్నారు.   రూల్ 16 ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ప్రకారం ముఖ్యమంత్రి చైర్మన్ షిప్ లో రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే జనవరి జూలై నెలలో చట్టంపై సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసారు. రూల్ 17 ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్ షిప్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ లు ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా కనీసం మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి.తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమీషన్ వెంటనే ఏర్పటు చెయ్యాలి.  తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలోని ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టులో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలకు గాను 33 ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలి.

  రోల్ 12 ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ప్రకారం కేసు నమోదు అయిన ఏడు రోజులలో ఎఫ్ఐఆర్, 60 రోజుల అనంతరం స్పెషల్ కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ అవగానే మరియు కోర్టులో కేసు ముగిసిన వెంటనే బాధితులకు అందించాల్సిన ఉపశమనం పునరావాసం మరియు అదనపు ఉపశమనం నిర్ణీత కాలం అందించాలి.  సాంకేతికత సాకుతో గత 12 నెలలుగా రెండు వేల ఎస్సీ/ఎస్టీ అత్యాచార బాధితులకు అందించాల్సిన ఉపశమనం పునరావాసం ఒక్క రూపాయి కూడా అందించలేదు, కావున యుద్ధ ప్రాతిపదికన బాధితులకు వెంటనే ఉపశమనం పునరావాసం అందించాలి.  సెక్షన్ 4 ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పిఓ ఏ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ తమ విధుల పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి  గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న నేషనల్ హెల్ప్ లైన్ ఫర్ అట్రాసిటీస్ అగైన్స్ ఎస్సీ ఎస్టీ టోల్ ఫ్రీ నెంబర్ 14566 మిగతా రాష్ట్రాలు మరియు మన రాష్ట్రంలోని ఇతర శాఖల మాదిరిగానే పేరెంట్ డిపార్ట్మెంట్ అయినా ఎస్సీడిడి పరిధిలోనే ప్రారంభించి పరివేక్షించాలి.ఎస్సీ/ఎస్టీ పి. ఓ ఏ చట్టం కేసు లలో 41A Crpc అమలు చేసి చట్టాన్ని నిర్వీర్యం చెయ్యకుండా కేవలం పి. ఓ. ఏ చట్టం రూల్స్ మాత్రమే అమలు చెయాలి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 81 అట్రాసిటీస్ ప్రోన్ ఏరియాలలో ప్రతివారం చట్టాలపై అవగాహన మరియు ఇతర కార్యక్రమాలు తూచ తప్పకుండా నిర్వహించాలి.  డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు ఇతర సిబ్బంది పని తీరుపై సమీక్ష నిర్వహించాలి.

 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిధిలోని ఐ. జి పి. సి. ఆర్ విభాగాన్ని పటిష్ట పరచాలి పై డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఎన్ ఏ పి ఎఫ్ రాష్ట్రస్థాయి ఉద్యమాలకు పూనుకుంటుందన్నారు. నఫ్ జిల్లా కమిటి ఎన్నికఈ సమావేశంలో నేషనల్ అట్రాసిటి నిరోధక ఫోర్స్ జిల్లా కమిటి ని ఎన్నుకొవడం జరిగింది. జిల్లా కన్వీనర్‌గా చుంచు రాజేందర్ ను ఎక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

 త్వరలో జిల్లా కలెక్టర్, పొలిస్ కమిషనర్‌ లను కలిసి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సభ్యులు చుంచు రాజేందర్, పుట్ట రవి, సింగారపు రవిప్రసాద్,లంబాడి హక్కుల పోరా సమితి  రాష్ర అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ నాయక్,బాలు నాయక్,డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్‌ కుమార్,  దళిత హక్కుల పొరాట సమితి జిల్లా అద్యక్షులు  సంగి యెలెందర్,జాతీయ మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు అంకెశ్వరపు రామచంద్రరావు, కేయు జాక్ చైర్మన్డాక్టర్ మంద వీరాస్వామి,గొసంగి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మంద మల్లేశం,
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంంఘం జిల్లా నాయకులు దొమ్మాటి ప్రవీణ్, బిఎస్ ఎఫ్ జిల్లా అద్యక్షులు మంద నరేష్, డిబిఎఫ్ నాయకులు బొర్ర సంపూర్ణ, మేకల అనిత,వనశ్రీ, సిలువేరు బిక్షపతి,పసుల దాసు, మాజీ సర్పంచ్ కుమార్,హేమలత,రవిందర్ తదితరులు పాల్గొన్నారు.