హనుమకొండ

వయో వృద్ధుల సంక్షేమమే లక్ష్యం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:14

హనుమకొండ, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)../... అంతర్జాతీయ వయో వృద్దుల వారోత్సవాలలో భాగంగా సోమవారం ఫాతిమానగర్ లోని సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో ఉన్న వారికి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలు పిల్లలు దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.అనంతరం హనుమకొండ సిడిపివో కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ వివిధ వృద్ధాశ్రమాలలో ఉన్న వారు తమకు ఎవరు లేరని, ఒంటరి వారిమనే దిగులు చెందవద్దని, వృద్దులకు చేయూత నివ్వడానికి ప్రభుత్వం అధికారులు ఉన్నారని అన్నారు.

ఐలమ్మ పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం చీఫ్ విప్ వినయ్ భాస్కర్

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:44

హనుమకొండ, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)..//.. వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని హంటర్ రోడ్లోని ఆమె విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఐలమ్మ భూమి, భుక్తి, విముక్తి కోసం చేసిన అలుపెరుగని పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

మడికొండలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 14:29

కాజీపేట, సెప్టెంబర్ 24 (ప్రజాజ్యోతి)..// బిజెపి లోకసభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా మడికొండ టెక్స్ టైల్ పార్క్ సందర్శించడానికి వచ్చిన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మకు హనుమకొండ జిల్లా నాయకులు పొనగోటి వెంకట్ రావు అధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో బిజెపి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి లేదంటే జరిమానా తప్పడు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:07

హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి).../ వాహనదారులు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సి వుంటుందని లేదంటే ట్రాఫిక్ జరిమానా నోటీస్ మీ ఇంటి తలుపు తడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు. ట్రై సిటి పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ట్రాఫిక్ క్రమబద్దీరణ చేస్తున్న పోలీసులకు తమ వంతు సహకారం అందించడం కోసం హనుమకొండలోని ఆజర హస్పటల్ యాజమాన్యం బుధవారం  వరంగల్ పోలీస్ కమిషనర్‌ కు  మూడు ఫోటో కెమెరాలను  అందజేసారు.

ఘణంగా అంబేద్కర్ యువజన సంఘం 46వ మహసభలు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:00

హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి22-09-2022../ 21-09-1977 రోజున అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్బావ దినం   21-09-2022 న ఉదయం 10 గంటలకి  అంబేద్కర్ విగ్రహప్రాంగనం లో అవిర్బావ దినోవొత్సవ సభను  నిర్వహింటం జరిగింది ఇట్టి సభను అంబేద్కర్ విగ్రహనికి ఫూల మాలలతో ప్రారంబించి  భుద్దివి విగ్రహాప్రాంగనంలో సమావేషం నిర్వహించటం జరిగినది ఈ సమావేషానికి ఉమ్ముడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మిదపాక ఏల్లయ్యగారు అద్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతితులుగా తేలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం చిప్పలపేల్లి అవిలయ్యగారు వచ్చారు 

వరంగల్ కు కేంద్ర సహాయ మంత్రి బి.ఎల్. వర్మ రాక

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 11:58

హన్మకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి).../   కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ వరంగల్ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 23, 24వ తేదీలలో హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు అని బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో వారి యొక్క పర్యటన విజయవంతం కొరకు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సమన్వయకర్తలను నియమించారు.

ఎంపి దయాకర్ కు కృతజ్ఞతలు తెలిసిన ఎంఆర్పీఎస్ నాయకులు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 11:54

హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి) .../ హైదరాబాద్ లో నిర్మించిన నూతన సచీవాలయానికి అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తు మాదిగ రాజకీయ పోరాటాసమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ల్యాదేళ్ల కుమార్వ మాదిగ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ ను తన నివాసంలో కలిసి పూలగుచ్చంతో కృతజ్ఞతలు తెలిపారు.

బాల అదాలత్ బెంచ్ విజయవంతం చేయాలి. అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 15:58

హనుమకొండ, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)  .. 21 సెప్టెంబర్ బుధవారం రోజున హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే బాల అదాలత్ బెంచ్ విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారులకు సూచించారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన నిర్వహించారు.

దివ్య శిష్య బృందం నృత్య ప్రదర్శన

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:00

హనుమకొండ, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../  తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్య శిష్య బృందం నృత్య ప్రదర్శనను ఇచ్చి ప్రశంసలను అందుకున్నారు.  ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ లు హాజరయ్యారు. నృత్య ప్రదర్శన ఇచ్చిన చిన్నారులను అభినందించి, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహించారు. గురువులను సన్మానించి, అభినందనలు తెలియజేశారు.