రచయిత, కవుల పాత్ర మరువలేనిది జంగా రాఘవ రెడ్డి

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:12
 The role of writers and poets is unforgettable Janga Raghava Reddy

హనమకొండ‌, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి).. మేధావులు, రచయితలు, కవులు, విద్యావంతులు తెలంగాణ ఉద్యమంలో ప్రథమంగా ముందుండి నడిపిన ఉద్యమ కారుల పాత్ర మరువలేనిదని మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. హన్మకొండ జడ్పీ హాల్ లో రచయిత్రి తెలంగాణ ఓరుగల్లు పోరు బిడ్డ మలిదశ ఉద్యమకారిణి రేపల్లె ఆడబిడ్డ తిరునగరి దేవకి దేవి  పుస్తకాల పరిచయ సభ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపల్లె వారి కుటుంబం మేధావులు రచయితలు విద్యావంతులు రాజకీయాలలో అన్ని రంగాలలో ఉండి మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం వారిదని, మేధావులు రచయితలు కవులు విద్యావంతులు తెలంగాణ ఉద్యమంలో ప్రథమంగా ముందుండి నడిపిన ఉద్యమ కారుల పాత్ర మరువలేనిదని అన్నారు. కోరుకున్న తెలంగాణాలో ఆత్మగౌరవం సంస్కృతి ఆచరణ మన సంపద మనకు దక్కాలని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, విద్యా వంతులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాలలో బ్రతుకుతున్న రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ప్రతి మనిషికీ ఈదేశంలో విలువలు దక్కాలని కోరుకున్నారు.

ఎంతో కష్టపడి ఏండ్ల తరబడి పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో మళ్లీ కలుపు మొక్కలు పరదేశం నుండి మన దేశానికి సొంతం వస్తే మన రాష్ట్రంలో పరాయి పెత్తనం వద్దు అనుకుంటే మన మొక్కలు గంజాయి మొక్కలు అయినాయన్నారు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన దశలో రచయితలు, కవులు, మేధావులు, విద్యావంతులు, కళాకారులు అందరూ కలిసి  తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా పోరాటం చేసామో తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత  ఉంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పోరేట్ జక్కుల రవీందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రేపల్లె శ్రీనాథ్, మాజీ కార్పోరేటర్ చంద్రయ్య, మాజీ కార్పోరేటర్ తొట్ల రాజు యాదవ్, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్, కాంటెస్ట్ కార్పోరేటర్ సంధ్యల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.