హనుమకొండ

అప్రెంటిస్ షిప్ మేళా 2022 గోడ ప్రతుల ఆవిష్కరణ

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:48

హనుమకొండ‌, సెప్టెంబర్13 (ప్రజాజ్యోతి)  బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, రీజినల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రేన్యూయార్షిప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహిస్తున్న అప్రెంటిస్ షిప్ మేళా 2022 కు సంబంధించిన గోడ ప్రతులను మంగళవారం ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల హనుమకొండ నందు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి ఏ. గోపాల్  విడుదల చేశారు.

సబ్సిడీ సిలెండర్ ల పట్టివేత

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:32

హనుమకొండ‌, సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి.;హనుమకొండ జిల్లాలో  అక్రమంగా వాడుతున్న సబ్సిడీ సిలిండర్ లను సివిల్ సప్లై అధికారులు పట్టకున్నారు. మంగళవారం నయిమ్ నగర్, కేయూసి క్రాస్, భీమారం  హాసన్ పర్తి ప్రాంతాల లోని హోటల్స్, చికెన్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీ చేసి, అక్రమంగా వాడుతున్న (75) సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి, 6 ఏ కేసులు నమోదు చేసారు. ఇట్టి తనిఖీలలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వసంత లక్ష్మి,  డిప్యూటీ తహాసీల్దార్లు జే. రమేష్, యం. కృష్ణ , సిబ్బంది పాల్గొన్నారు.

వెయ్యిస్తంభాల గుడికి యునెస్కో గుర్తింపుకు కృషి చేస్తా

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:12
  • రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

హనుమకొండ‌, సెప్టెంబర్10 (ప్రజాజ్యోతి) కాకతీయుల కళావైభవానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి కోటి రూపాయాలను కేటాయించారు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్. శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆయన భద్రకాళీ అమ్మవారిని, రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

Submitted by bosusambashivaraju on Sat, 10/09/2022 - 17:06

హనుమకొండ‌, సెప్టెంబర్10 (ప్రజాజ్యోతి)జిల్లా లో ఈ నెల 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటుజరిగే తెలంగాణా  జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగ్లా  నందు నోడల్ అధికారులతో కలెక్టర్  అదనపు జాయింట్ కలెక్టర్ సంధ్యా  రాణి  తో కలసి సమీక్ష సమావేశం  నిర్వహించారు.

సంచారు.జాతులకు పది ఎకరాలు కేటాయింపు

Submitted by bosusambashivaraju on Sat, 10/09/2022 - 17:00

హనుమకొండ‌, సెప్టెంబర్ 10 (ప్రజాజ్యోతి)  హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రములో సంచార జాతి కులాలకు ఆత్మ గౌరవ భవనం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ బాగాయత్ లో  10 ఎకరాల స్థలం కేటాయించటం జరిగింది. అట్టి స్థలం యొక్క ప్రభుత్వ కేటాయింపు పత్రమును రాష్ట్ర బీసీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ సిఇఓ మల్లయ్యబట్టు కు అందజేశారు. అట్టి స్టలంలో ప్రభుత్వమే అన్ని ఎంబిసి కులాలకు ఉమ్మడిగా సంచార జాతుల ఆత్మ గౌరవ భవనం నిర్మాణం చేసి ఇచ్చుట జరుగుతుందని గతంలోనే నిర్వహించిన సమావేశంలోనే తెలియజేశారు.

సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలి

Submitted by sridhar on Wed, 07/09/2022 - 19:44

హనుమకొండ‌, సెప్టెంబర్ 07 (ప్రజాజ్యోతి) బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తీగల భరత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి హాస్టల్ లో రోజు ఏదో ఒక సమస్య వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కూడా కెసిఆర్ కానీ విద్య శాఖ మంత్రి కానీ ఎందుకు స్పందించడం లేదన్నారు.

ఆర్ట్స్ కళాశాలలో యోగాపై అవగాహన కార్యక్రమం

Submitted by sridhar on Wed, 07/09/2022 - 16:53

హనుమకొండ‌, సెప్టెంబర్07 (ప్రజాజ్యోతి); హన్మకొండ సుబేదారి లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నీ“ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్”( ఐక్యూ ఏసీ) ఆధ్వర్యంలో బుధవారం యోగా గురువు జితేందర్ ఆధ్వర్యంలో భారతీయ సాంప్రదాయిక యోగ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య ప్రారంభించారు.