ఆర్ట్స్ కళాశాలలో యోగాపై అవగాహన కార్యక్రమం

Submitted by sridhar on Wed, 07/09/2022 - 16:53
Awareness Program on Yoga in Arts College

హనుమకొండ‌, సెప్టెంబర్07 (ప్రజాజ్యోతి); హన్మకొండ సుబేదారి లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నీ“ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్”( ఐక్యూ ఏసీ) ఆధ్వర్యంలో బుధవారం యోగా గురువు జితేందర్ ఆధ్వర్యంలో భారతీయ సాంప్రదాయిక యోగ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ మన ప్రాచీన కాలం నుండి పూర్వీకులు యోగాను ఎంతగానో ఆదరించడం తో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పవచ్చు, అంతేకాకుండా నేటి యువతరానికి యోగాపై అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జితేందర్ మాట్లాడుతూ భారతదేశంలో తరతరాలుగా వస్తున్న యోగాను నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆచరిస్తున్నారని నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యవంతమైన జీవనాన్ని పెంపొందించడంలో యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

విద్యార్థులు నిత్యం యోగాను ఆచరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ కరుణాకర్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.