సంచారు.జాతులకు పది ఎకరాలు కేటాయింపు

Submitted by bosusambashivaraju on Sat, 10/09/2022 - 17:00
Allotment of Ten Acres to Nomadic Castes

హనుమకొండ‌, సెప్టెంబర్ 10 (ప్రజాజ్యోతి)  హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రములో సంచార జాతి కులాలకు ఆత్మ గౌరవ భవనం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ బాగాయత్ లో  10 ఎకరాల స్థలం కేటాయించటం జరిగింది. అట్టి స్థలం యొక్క ప్రభుత్వ కేటాయింపు పత్రమును రాష్ట్ర బీసీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ సిఇఓ మల్లయ్యబట్టు కు అందజేశారు. అట్టి స్టలంలో ప్రభుత్వమే అన్ని ఎంబిసి కులాలకు ఉమ్మడిగా సంచార జాతుల ఆత్మ గౌరవ భవనం నిర్మాణం చేసి ఇచ్చుట జరుగుతుందని గతంలోనే నిర్వహించిన సమావేశంలోనే తెలియజేశారు. నేడు ప్రభుత్వం ద్వారా సంచార జాతులకు కేటాయించిన 10 ఎకరాల స్థలం యొక్క హక్కు పత్రం సంచార జాతి కుల నాయకులకు గౌరవంగా ఎంబిసి కార్పొరేషన్ సిఇఒ మల్లయ్య బట్టు  చేతులమీదుగా...తెలంగాణ రాష్ట్ర సంచార జాతులఆత్మగౌరవ భవన  వెల్ఫేర్ ట్రస్ట్,  సంచార జాతుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తిపిరిశెట్టి, వివిధ సంచార జాతుల కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో కలిసి అట్టి ఆస్తి పత్రం అందుకున్నారు.


ఇట్టి ఆస్తి ప్రభుత్వం ఏ ఒక్క సంఘానికిగాని కులానికిగాని, కుల నాయకునికిగాని వ్యక్తిగతంగా ఇచ్చినట్టు కాదని ఈ ఆస్తి ప్రభుత్వం అన్ని సంచార కులాల సభ్యులకు ఇచ్చినదిగా, అన్ని కులాల సభ్యులకు ఉమ్మడి ఆస్తి మాత్రమే అని మంత్రి సభా ముకంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ తిపిరిశెట్టి మాట్లాడుతూ ఇన్ని ఏండ్ల కాలంలో ప్రభుత్వం ఇప్పటికైనా గురించి ఈ జాతుల అభివృద్ధికోసం కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర సంచార జాతి కులాల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపారు. ఇట్టి ఆస్తి సంచార జాతి ప్రజల ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం ఇచ్చినందుకు  సహకారం అందించిన మంత్రులకు, నాయకులకు ప్రభుత్వ అధికారులకు, సంచార జాతి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతికుల సభ్యులఅందరికి  బౌషత్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అడ్రెస్స్ ఉంటుందని తెలుపుతూ అందరికి అభినందనలు తెలియజేసారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ మాజీ సిఇఒ అలోక్, వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు,చెన్నయ్య, శ్యామల యాదగిరి, అరె రాములు, లక్ష్మన్ రావు, కోట రాములు, జెల్లి యాదగిరి, సిద్దుల రవీందర్, సిద్దిపేట మైసయ్య, జెగ్గయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.