అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కార్పోరేటర్

Submitted by sridhar on Wed, 07/09/2022 - 17:21
Corporator who visited the Anganwadi Centre

కాజీపేట, సెప్టెంబర్07 ( ప్రజాజ్యోతి) 

46వ డివిజన్ రాంపూర్ లో బుధవారం స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడి సెంటర్ లో జరిగే ప్రీస్కూల్ కార్యక్రమాలు అభ్యాసన దీపిక, వ్యాయామం, కథలు, ఆటలు పాటలు, సంసిద్ధత అన్ని కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకొని ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నాయని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పోషణ మాసం సందర్భంగా జరుగుతున్న పెరుగుదల పర్యవేక్షణ స్పెషల్ డ్రైవ్ గురించి తెలుసుకున్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు గురించి తల్లులు జాగ్రత్త వహించి వారికి పోషకాహారం అందించి సాధారణ బరువుకు వచ్చే విధంగా ప్రయత్నించాలని తల్లులకు సూచన చేశారు. రిజిస్టర్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జీ. ఉమ, హెల్పర్ ఎం. యాదమ్మ, తల్లులు పాల్గొన్నారు.