అప్రెంటిస్ షిప్ మేళా 2022 గోడ ప్రతుల ఆవిష్కరణ

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:48
Apprenticeship Mela 2022 unveiling of wall prints

హనుమకొండ‌, సెప్టెంబర్13 (ప్రజాజ్యోతి)  బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, రీజినల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రేన్యూయార్షిప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహిస్తున్న అప్రెంటిస్ షిప్ మేళా 2022 కు సంబంధించిన గోడ ప్రతులను మంగళవారం ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల హనుమకొండ నందు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి ఏ. గోపాల్  విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019- 20, 2020-21, 2021-22 విద్యా సంవత్సరంలో వృత్తివిద్య కోర్సులలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా కూడా ఈ యొక్క అప్రెంటిస్ షిప్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. దివాకర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఈ. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు బెడుదం శ్రీనివాస్, వీ. లక్ష్మారెడ్డి, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ సవాసి శ్రీనివాస్, డాక్టర్ ఆర్. ప్రవీణ్ కుమార్, చొప్పరి శ్రీనివాస్, ఏం. సమ్మయ్య, ఆర్ రాజు, మాస్ వోకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పాము శ్రీనివాసులు పాల్గొన్నారు.