హనుమకొండ

సీఐని కలిసిన సాంఘిక సంక్షేమ పాఠశాల సిబ్బంది

Submitted by sridhar on Wed, 07/09/2022 - 09:21

కాజీపేట, సెప్టెంబర్06 (ప్రజాజ్యోతి) మడికొండ పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణును మడికొండ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి వారి సిబ్బంది, విద్యార్థినీలతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సిఐ వేణుని  పాఠశాలకు వచ్చి పలు అంశాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆహ్వానించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు

Submitted by sridhar on Tue, 06/09/2022 - 17:28

కాజీపేట, ఆగస్టు 06 ( ప్రజాజ్యోతి) కాజిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డ ముగ్గురికి జైలు విధించినట్లు కాజీపేట ట్రాఫిక్ సిఐ రామక్రిష్ణ తెలిపారు. పట్టబడిన వారిని కోర్టు లో హాజరు పరుచగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప ముగ్గురికి 2 రోజుల జైలు శిక్ష విధించగా వారిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించగా, కోర్టు వారితో పాటు మరో  11 మందికి 15,000 రూపాయల జరిమానా విధించినట్లు సిఐ తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో గణేష్ నిమజ్జనం పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి

Submitted by veerareddy on Tue, 06/09/2022 - 17:09

హనుమకొండ‌, ఆగస్టు06 (ప్రజాజ్యోతి)  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ గణేష్ నిమజ్జనం నిర్వహించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మంగళవారం ఈ నెల 9వ తేదిన వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహింబడే గణేష్ నిమజ్జనం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, స్థానిక ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, గ్రేటర్ మున్సిపల్, విద్యుత్తు ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బందితో కల్సి గణేష్ నిమజ్జనం జరపబడే బంధం చెరువు, ఉర్సు గుట్ట చెరువు, చిన్నవడ్డెపల్లి, కోట చెరువు, సిద్ధేశ్వరగుండం, హసనపర్తి చెరువులను పరిశీలించారు.

మరో వివాదంలో ఎన్ఎస్ఆర్ ఆయన నివాసంలో పేకాట, పరారిలో నాయిని సంపత్ రావు

Submitted by veerareddy on Mon, 05/09/2022 - 17:33

హన్మకొండ, ఆగస్టు05 (ప్రజాజ్యోతి)  ఎన్ఎస్ఆర్ పాల ఉత్పత్తుల పై ఆరోపణులు మరవకముందే నాయిని సంపత్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎస్ఆర్ పాల డైరీ, స్కూల్స్, హోటల్స్ అధినేత నాయిని సంపత్ రావు  ఇంట్లో నిషేధిత పేక అట ఆడుతన్న  పలువురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నాయిని సంపత్ రావు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు . మిగతావాళ్ళను అరెస్ట్ చేసిన వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద నుండి 08 సెల్ ఫోన్స్, సుమారు 3లక్షల 60వేల నగదు స్వదినం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేశ

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:35
  • ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

కాజీపేట, ఆగస్టు05 (ప్రజాజ్యోతి) ; విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలు భొదించారు. సోమవారం మాస్టర్ జీ పాఠశాల మడికొండ బ్రాంచ్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి స్వయం పాలన దినోత్సవం ను జరుపుకున్నారు. విద్యార్థులు పాఠాలు భోదించారు. ఈ వేడుకలలో ప్రిన్సిపాల్ షీలో, ఏవో రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 15:18

ప్రజా జ్యోతి నాగారం సెప్టెంబర్ 01

మండల పరిధిలోని మాచిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బండారి నర్సయ్య, వంగాల రవి కూతురు సాన్విక ఆకస్మికంగ మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ మృతుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరువైవేలు రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.