డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

Submitted by Kramakanthreddy on Thu, 08/09/2022 - 17:33
Care should be taken against seasonal diseases like dengue, malaria and typhoid
  • జిల్లా కేంద్రంలో ముమ్మరంగా డెంగ్యూ నివారణ చర్యలు
  • వినాయక విగ్రహాల నిమజ్జన నిమిత్తం బైపాస్ దగ్గర వాహనాల ఏర్పాటు
  • మున్సిపల్ చైర్మన్ కోరమోని నరసింహులు

మహబూబ్నగర్, సెప్టెంబర్ 8 ( ప్రజా జ్యోతి ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ప్రజలు ప్రమాదకరమైన డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్,వైరల్,సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, ఇంటి ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు ప్రజలను కోరారు.  మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డులలో వార్డులలో తిరిగి పరిసరాల పరిశుభ్రత పై వార్థు ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో  ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రతపై,ప్రస్తుతం వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై,ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధిపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింలు తెలిపారు.

గ్రామములో అంటి లార్వాల్ ఆపరేషన్ లో భాగంగా ఇంటి మరియు ఇంటి పరిసరాల్లో ఉన్న నీటి నిల్వలను చెక్ చేసి, దోమపిల్లలు లార్వా, గుడ్డు, ఫూపా లు ఉన్నట్లయితే, వాటిలో టేమిఫాస్ అను కెమికల్ వేయుట ద్వారా మఱియు నీటి నిల్వలను తొలగించి పడబోయుట ద్వారా మరియు  గాలిలో ఏరోసాల్ పద్ధతిన స్ప్రే చేయుట ద్వారా డెంగ్యూ వ్యాధిని కలిగించే పెద్దదోమలను చంపవచ్చని,సాయంత్రము వేళ అన్ని వార్డులలో ఫాగ్గింగ్  ఇర్వహించుట జరుగుతుందని
మరియు ఇళ్లలో వుండే పాత డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు రేకులు, పాత టైర్లు, మట్టి కుండలు, ఇతర పనికి రాని వస్తువులను సేకరించి, ట్రాక్టర్ ద్వారా తగోలగించడం జరిగిందని మరియు ఇంటింటికి తిరిగి దోమకాటు వ్యాధుల నుంచి అరికట్టేందుకు ప్రజలు తీసుకొన చర్యల పై అవహగహన కల్పిస్తున్నామని వారు అన్నారు.

వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వినాయకుని నిమజ్జనంలో ఎవరికి ఎటువంటి ఆపద సంభవించకూడదని ఉద్దేశంతో గత సంవత్సరం 42 వాహనాలను ఏర్పాటు చేశామని ఆ వాహనాల ద్వారా వినాయకుడి విగ్రహాలను బీచ్పల్లికి తీసుకెళ్లి అక్కడ నిమర్జనం చేస్తామని తెలుపగా కేవలం నాలుగు వాహనాలలో మాత్రమే వినాయకుడిని తీసుకు వెళ్ళామని ప్రజలకు ఎంత వివరించిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దయచేసి ఈ సంవత్సరమైనా ప్రజలు తమ వినాయక విగ్రహాలను నిమర్జనం చేసే నిమిత్తం మీ క్షేమం కోసమై బైపాస్ దగ్గర ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా మీ వినాయకులను నిమజ్జనం నిమిత్తం బీచుపల్లికి పంపాలని కోరారు. గత సంవత్సరం కెసిఆర్ ఎకో పార్క్ ముందుర చెరువులో నిమర్జనం నిమిత్తం వెళ్లి ఒక యువకుడు చనిపోయాడని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.