పాలకీడు

ఉపాధి హామీ పని లో వేలిముద్ర పడని వారు ఎం పి డి ఓ కార్యాలయానికి వెళ్ళండి ఎం పి పి గోపాల్

Submitted by Ramesh Peddarapu on Wed, 21/09/2022 - 16:02

పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసి వేలిముద్రలు పడక వేతనాలు అందని వారికి  మండల పరిషత్ కార్యాలయంలో పరిష్కారం లభిస్తుందని ఎంపీపీ బూక్య  గోపాల్ నాయక్ సూచించారు. కూలీలు ఆధార్ కార్డు, జాబ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ జెరాక్స్ కాపీ లతో మండల పరిషత్ కార్యాలయం లో అప్డేట్ చేయించుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఆ తరువాత సమీప పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు నుండి ఉపాధి హామీ డబ్బులు పొందవచ్చన్నారు.కార్యక్రమంలో ఎం పి డి ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎ పి ఓ సందీప్ రెడ్డి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
 

బోత్తల పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ను తెలుసుకొన్న నోడల్ అధికారి బాలు

Submitted by Ramesh Peddarapu on Wed, 21/09/2022 - 15:59

పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలం బొత్తల పాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని  తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా  మండల నోడల్ అధికారి బాలు సందర్శించారు. పాఠశాలలో బోధనా విధానం అమలవుతున్న తీరును , తరగతి గదులవారీగా పరిశీలించారు. విద్యార్థుల స్థాయి, వారు పాఠ్యాంశాలని అర్థం చేసుకుంటున్న స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు,  విద్యార్థులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు పూల్ సింగ్, నాగార్జునతో పాటు  ప్రధానోపాధ్యాయుడు రెడ్డిపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ధర్మరాజు, మక్త నాయక్, యూసుఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలు,బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి సూపర్ వైజర్ యశోద

Submitted by Ramesh Peddarapu on Tue, 20/09/2022 - 16:02

పాలక వీడు,సెప్టెంబర్20(ప్రజా జ్యోతి): పాలక వీడు మండలం లోని. జాన్ పహాడ్ గ్రామంలో మంగళ వారం రోజున  పోషణ అభియాన్ లో భాగంగా  ఆంగన్ వాడి కేంద్రంలో బాలింతలు,గర్భిణీ మహిళలు రక్త హీనత రాకుండా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం పై మహిళలకు ఆంగన్ వాడి సూపర్ వైసర్ యశోద వివరించటం జరిగింది.ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్,కూరపాటి వెంకటేశ్వర్లు,పంచాయితీలో కార్యదర్శి స్వామి, అంగన్వాడీ టీచర్లు కె. వసుందర,కే. నిర్మల,మనెమ్మ,వెంకటమ్మ, అంగన్వాడీ అయాలు, ఏ యన్ యం లు,మహిళలు గర్భిణీ స్త్రీలు,తదితరులు పాల్గొన్నారు.

నాలుగేళ్లకు ముఖ్య మంత్రి కరునించినా అధికారులు వరమివ్వని దిస్తితి

Submitted by Ramesh Peddarapu on Tue, 20/09/2022 - 11:06
  •  పైసలిస్తెనే ధరకాస్తు పై సంతకం?
  • కాసులకు కక్కుర్తి పడి వితంతువుల ధరకాస్తు పక్కకి పడేసిన అధికారులు.
  • ఒకే ఇంట్లో రెండు రావడం అవినీతికి అద్దం పడుతుంది.
  • వాస్తవంగా లబ్ది పొందాల్సిన వారికి అన్యాయం!
  • అడుగుతున్న బాధితులకు  రోల్ బ్యాక్,  టెక్నికల్ ప్రాబ్లెమ్ అని సమర్థించుకుంటన్న అధికారులు.

పాలక వీడు,సెప్టెంబర్19(ప్రజా జ్యోతి):  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లక్షల్లో కొత్త ఆసరా పెన్షన్ లక్షల్లో ఇచ్చామని పేపర్లలో లెక్కలు చూపిస్తుంటే.క్షేత్ర స్థాయిల

34లక్షల తో పాటశాల అభివృద్ధికి శంఖుస్థాపన చేసిన ఎం పి పి గోపాల్

Submitted by Ramesh Peddarapu on Tue, 20/09/2022 - 10:34

పాలక వీడు,సెప్టెంబర్19(ప్రజా జ్యోతి): మనఊరు- మనబడి లో బాగంగా జాన్ పహాడ్ దర్గా కాల్మెట్ తండ ప్రాథమిక పాఠశాల నందు అభివృద్ధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో 16 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు 18 లక్షలు 34 లక్షలు మంజూరు తో అదనపు తరగతి గది,ప్రహరీగోడ, మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఎం పి పి భూక్యా గోపాల్ నాయక్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ రూపవత్ ఘోరీ, బెట్టె తండ సర్పంచ్ మాలోత మోతిలాల్ నాయక్, ఎం ఈ ఓ చత్రు నాయక్,నాయకులు బానోత వెంకట్, కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

షార్ట్ సర్క్యూట్ తో రూ.3 లక్షల విలువ గల సామగ్రి దగ్దం..

Submitted by Ramesh Peddarapu on Sat, 17/09/2022 - 11:05

పాలక వీడు,సెప్టెంబర్16(ప్రజా జ్యోతి): సూర్య పేట జిల్లా పాలక వీడుమండల పరిధిలోని కల్మెట్ తండా కు చెందినభూక్య దేన్య  ఇంట్లో మూడు లక్షల విలువైన వస్తువులు కాలిపోవడం జరిగింది . ప్రభుత్వం తమను ఆడుకోవాలని బాధితులుు కోరుతున్నారుు.

వికలాంగ మద్య తరగతి ఉద్యోగి ని ఇబ్బందులకు గురి చేస్తున్న సూర్యపేట జిల్లా అగ్ర కుల ఉన్నతాధికారులు .

Submitted by Ramesh Peddarapu on Sat, 17/09/2022 - 10:56
  • ఆదుకోవాలని మంత్రి,ఎం ఎల్ ఏ కి వేడుకోలు
  • విధి నిర్వహణలో నూ కుల వివక్ష ,వికలాంగుడు పై ఉన్నతాధికారుల వేదింపులు  
  • అనుభవం ఉన్నా ప్రమోషన్ లేదు కారణం ఉన్నతాధికారుల కుల పిచ్చి
  • ఏ జే సి, హుజూర్నగర్ ఆర్డీవో వేదిస్తున్నరంటు ఓ సీనియర్ ఉద్యోగి ఆవేదన

పాలక వీడు, సెప్టెంబర్16(ప్రజా జ్యోతి): సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో(04)సంవత్సరంల‍ (08)నెలలు, రేవెన్యు శాఖ లో నాయాబ్ తహశీల్దార్ గ పని చేసిన  వికలాంగుడు, ఊబకాయం ,బ్యాక్ పెయిన్ ఇతర అనారోగ్య కారణములతో బాధపడుతున్నసబ్బి కిషోర్ బాబు

జాన్ పహాడ్ దర్గా కు నిధులు,సఫాయి వర్కర్ లకు జీతాలు పెంచాలి

Submitted by Ramesh Peddarapu on Fri, 16/09/2022 - 11:22

 పాలక వీడు, సెప్టెంబర్15( ప్రజా జ్యోతి) . తెలంగాణా రాష్ట్రం లోని అతి పెద్ద పుణ్యక్షేత్రమైన హిందు ముస్లిమ్ ల ప్రతీక గా విరజిల్లుతున్న జాన్ పహాడ్ దర్గా పాలక వీడు మండలం సూర్యాపేట జిల్లా లో ఉంది. ఈ దర్గాకు ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కందూరు (మొక్కుబడి) చెల్లించి మేకపోతులు పోటెళ్లు కోళ్ళు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ దర్గాకు ఇతర రాష్ర్టాల నుండి వివిధ దేశాల నుంచి కూడ భక్తులు వస్తుంటారు.

సెప్టెంబర్ 17న బంజారా భవన్ ఓపెనింగ్ ని జయ ప్రదం చేయండి బంజారా నాయకులు

Submitted by Ramesh Peddarapu on Fri, 16/09/2022 - 10:53

పాలక వీడు,సెప్టెంబర్15(ప్రజా జ్యోతి):  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సెప్టెంబర్ 17, నా హైదరాబాదులో ప్రారంభించబోయే సేవాలాల్ బంజారా భవన్, కొమరం భీమ్ ఆదివాసి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే సి ఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ట్రై కార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, పిలుపుమేరకు అదేవిధంగా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  ఆదేశానుసారం  హుజూర్నగర్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజా ప్రతినిధులు  ఉద్యోగులు ,మేధావులు ,పార్టీలకు అతీతంగా సెప్టెంబర్ 17న జరగబోయే గిరిజన సభకు హుజూర్నగర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరై సభను