బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి

Submitted by Ramesh Peddarapu on Tue, 20/09/2022 - 16:07
Reservation for BCs should be increased to 50 percent

 బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు డిమాండ్

పాలక వీడు,సెప్టెంబర్20(ప్రజా జ్యోతి):బీసీల రిజర్వేషన్లు 50% పెంచాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు ఆయన పాలక వీడు మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ఆరు నుంచి 10 శాతానికి పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, గిరిజనులకు పెంచిన మాదిరిగానే బీసీలకు కూడా రిజర్వేషన్ శాతం పెంచాలని బీసీలకు ఉన్న 29 శాతం రిజర్వేషన్, ను 50 శాతానికి పెంచాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు, అసెంబ్లీ లోనూశాసనమండలిలోనూ పార్లమెంటులోనూరాజ్యసభలోను 
 వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో మరియు పంచాయతీ రాజ్ లో బీసీలకు 50% రిజర్వేషన్ సాధించేవరకు పోరాటంకొనసాగించాలని,శాసనసభపార్లమెంటువెలుపలక్షేత్రస్థాయిలోబీసీహక్కులసాధనసమితిఆధ్వర్యంలోబీసీరిజర్వేషన్సాధించేంతవరకుబీసీలనుసమీకరించి ఉద్యమిస్తామని రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు అంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. 

తెలంగాణ రాష్ట్రంలో బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని నాలుగు సంవత్సరాల క్రిందట రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇంటర్వ్యూలను నిర్వహించి సుమారు 5 లక్షల 45 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని, కానీ ఇంతవరకు వారికి రుణ సౌకర్యం కల్పించలేదని, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే బిసి యువతకు సౌకర్యం కల్పించి బిసి సాధికారత కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు  ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి నాయకులురావుల సత్యం, బాదే నరసయ్య ఉన్నారు.