జాన్ పహాడ్ దర్గా కు నిధులు,సఫాయి వర్కర్ లకు జీతాలు పెంచాలి

Submitted by Ramesh Peddarapu on Fri, 16/09/2022 - 11:22
 Funds for Jan Pahad Dargah and salaries for cleaning workers should be increased

 పాలక వీడు, సెప్టెంబర్15( ప్రజా జ్యోతి) . తెలంగాణా రాష్ట్రం లోని అతి పెద్ద పుణ్యక్షేత్రమైన హిందు ముస్లిమ్ ల ప్రతీక గా విరజిల్లుతున్న జాన్ పహాడ్ దర్గా పాలక వీడు మండలం సూర్యాపేట జిల్లా లో ఉంది. ఈ దర్గాకు ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కందూరు (మొక్కుబడి) చెల్లించి మేకపోతులు పోటెళ్లు కోళ్ళు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ దర్గాకు ఇతర రాష్ర్టాల నుండి వివిధ దేశాల నుంచి కూడ భక్తులు వస్తుంటారు. కానీ భక్తులకు ఇక్కడ కనీస వసతులు సౌకర్యాలు లేవు జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ తరువాత మూడు రోజుల పాటు ఉర్సు గంధం ఉత్సవాలు నిర్వహిస్తారు సంవత్సరానికి ఒక సారి జరిగే ఉర్సు ఉత్సవాలు కూడ అరకొర నిధులతో తూతూమంత్రంగా నిర్వహించి వుక్ఫ్ బోర్డ్ వారు చేతులు దులుపుకుంటారు. ఇది ఇలా ఉండగా జాన్ పహాడ్ దర్గా వద్ద పని చేసే సిబ్బంది మొత్తం పన్నెండు మంది ఉన్నారు సిబ్బంది అంతా 1983 నుండి సుమారు నెలకు 90 రూపాయల నుండి ఇప్పుడు అనగా 2022 వరకూ 4000 వెల రూపాయలకు  ఉద్యోగం చేస్తున్నారు.

వీళ్లంతా 39 సంవత్సరాల క్రితం నుండి వెట్టి చాకిరీ చేసుకుంటూ వచ్చారు మా సిబ్బందిని వక్ఫ్ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వం కాని పట్టించుకోవటం లేదు చాలి చాలని జీతం ఉద్యోగం బంద్ చేద్దామా ఇకనైనా ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అధికారులు మా సమస్యను పరిష్కరిస్తారు అని ఆశతో ఎదురు చూస్తూ పని చేస్తున్నాం అని ఆవేదన వ్యక్తంచేశారు ఇక్కడ పని చేసే సిబ్బంది మొత్తం పక్క గ్రామాల నుండి ఆటోలో బస్సుల్లో ప్రయాణం చేసి డ్యూటీ రావాలి అందుకు రోజు రాను పోను ఛార్జీలు నలభై రూపాయలు అంటే ఒక్క నెలకు 1200 ప్రయాణ ఛార్జీలు ఖర్చు అవుతుంది సిబ్బంది జీతంలో పన్నెండు వందలు పోతే మిగిలేది ఇరవై ఎనిమిది  వందలు ఈ మిగిలిన డబ్బుతో పెళ్ళాం పిల్లలు ఏమి తినాలి ఎట్లా బ్రతకాలి అని అన్నారు. ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీలో ఉన్నా కూడ పట్టించు కోలేని పరిస్తితిలో ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ వారు ఉన్నారో అర్థం ఐతుంది ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించి మాకు కనీస వేతనం హెల్త్ కార్డులు ఉద్యోగ భద్రత కల్పించి వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగిస్తారు అని ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు.