పాలకీడు

నాకు లంచం వద్దు

Submitted by Ramesh Peddarapu on Thu, 15/09/2022 - 10:12


పాలక వీడు,సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం పాలకీ డు మండలం ఆర్. ఐ చిలకరాజు నర్సయ్య నాకు లంచం వద్దు అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు.ఇది నియోజక వర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నూతన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ నగదు అందజెత

Submitted by Ramesh Peddarapu on Wed, 14/09/2022 - 18:27

పాలక వీడు,సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మం చ్ది కొత్త లబ్ది దారులకు సి ఎం. కె సి అర్ ఆసరా పెన్షన్ పథకం అమలు చేయగా. పాలకీడు మండలం లో మొత్తం 808 మందికి లబ్ది చేకూరింది. కాగా మండల పరిధిలోని గుండెబోయిన గూడెం గ్రామంలో 14 మందికి రూ.రెండు వెయిల పదహార్లు .మండల తెరాసా పార్టీ అధ్యక్షుడు కిష్టపాటీ అంజిరెడ్డి చేతులమీదుగా అందించారు.లబ్ది దారులు హర్షం వ్యక్తం చేశారు.

పుల్లారెడ్డి అరెస్టు చేయాలి అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పున: నిర్మించాలి

Submitted by Ramesh Peddarapu on Wed, 14/09/2022 - 12:18

పాలక వీడు,సెప్టెంబర్13(ప్రజా జ్యోతి): పాలకీడు మండల కేంద్రంలో మామిడి సురేష్ అధ్యక్షతన జరిగిన దళిత ప్రజా సంఘాల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ గరిడేపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగింగించిన అదే స్థలంలో అక్రమ కట్టడాకలను నిర్మిస్తున్న బండ పుల్లారెడ్డి అనే వ్యక్తిని సామాజిక కార్యకర్త అయిన పిట్ట బాబు అడ్డుకోవడం జరిగింది. బండ పుల్లారెడ్డి అనే  వ్యక్తి పిట్ట బాబుని కులం పేరుతో దూషించి నేటికీ 18 రోజులు  గడుస్తున్నా పుల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదని ప్రజా సంఘాలు ఖండించాయి.

దళిత బందు లో పాడి గేదెలు వచ్చిన యూనిట్ లను పరిశీలిస్తున్న యం పి డి ఓ

Submitted by Ramesh Peddarapu on Wed, 14/09/2022 - 11:35

పాలక.వీడు,సెప్టెంబర్13(ప్రజా జ్యోతి):  మంగళ వారం రోజు దళిత బందు పథకంలో భాగంగా డైరీ ఫామ్ లబ్ధిదారులకు వచ్చినటువంటి పాడి గేదలను పరిశీలిస్తున్న జె. శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ అబివృద్ది అధికారి,పాలకీడు  పరిశీలించడం జరిగినది. 
ఇట్టి కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల.అభివృద్ధికి నిధులు పెంపు పై సమీక్ష సమావేశం

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 11:25

పాలక వీడు,సెప్టెంబర్13(ప్రజా జ్యోతి):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేరేడుచర్లలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ(హెచ్ డి యస్) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పి హెచ్ సి  కి కావలసిన సదుపాయాలపై సౌకర్యాలు, అవసరమైన సామాగ్రి కొనుగోలు కొరకు(త్రాగు నీరు, ఇంటర్నెట్ బిల్లు, స్టేషనరీ ఓ పి  చిట్టిలు , అత్యవసర మందులు )  కావలసిన నిధుల గురించి చర్చించి,ఆమోదించడమైనది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో వసతుల కల్పన కొరకు ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పెంచాలని పాలక వీడు ఎం పి పి భూక్యా గోపాల్ నాయక్ కోరారు.

వీది కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి

Submitted by shaikmohammadrafi on Sun, 11/09/2022 - 18:32

పాలక వీడు,సెప్టెంబర్11(ప్రజా జ్యోతి): పాలక వీడు మండలం కోమటి.కుంట గ్రామంలో నల మెట్టి సైదులు  అనే గొర్రెల కాపరి  గొర్రెల దొడ్డిలో కి  శని వారం రాత్రి కుక్కలు పోయి 8 గొర్రెలను కొరికి చంపటం జరిగింది.మరో నాలుగు  గొర్రెలకు గాయాలు అయ్యాయి అని ,దాదాపుగా లక్ష రూపాయల నష్టం జరిగినట్లుగా గొర్రెల యజమాని సైదులు గ్రామస్తులకు చెప్పి బాధపడటం జరిగింది.గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువైందని రోడ్డు మార్గంగా వెళ్ళే    ద్వి.చక్ర వాహనాల పై,కారుల పై ఎగబడుతున్నాయి అని, ఆ భయానికి బైకు లు క్రిందపడటపోవటం జరుగుతుందని వీది కుక్కలను ప్రభుత్వం వెంటనే  నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.

పసలేని సర్వ సభ్య సమావేశం

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 14:50

పాలక వీడు,సెప్టెంబర్5(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం అసంతృప్తిగా ముగిసింది. సమావేశానికి పలు శాఖల అధికారులు, మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు ఒక్క సర్పంచ్ సైతం  హాజరు కాకపోవడంతో, ఎంపీపీ గోపాల్ నాయక్ తో సహా  పలువురు ఎంపీటీసీలు  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ, పశు వైద్యం, విద్యాశాఖ, మరికొన్ని శాఖల మండల బాధ్యత గల అధికారులు రాకపోవడంతో సమస్యలకు సమాధానం దొరకలేదు. సాగర్ ఎడమ కాలువ పదో నెంబర్ జానపాడు మేజర్ చివరి భూములకు నీరు అందడం లేదని, ప్రభుత్వం విధించిన వారబంది పద్ధతిని తొలగించి నిరంతరాయంగా రైతులకు నీరు అందించాలని సమావేశం కోరింది.