పాలకీడు

మూల మలుపులో పొంచి ఉన్న ప్రమాదం

Submitted by Ramesh Peddarapu on Wed, 28/09/2022 - 10:23

పాలక వీడు,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి):  పాలకవీడు మండలం జాన్ పహాడ్   దర్గాకు వెళ్ళే దారిలో  ఫ్లైఓవర్ మూలమలుపులో మోకాలు లోతు గుంతలు పడి ఉన్నాయి. ఈ రోడ్డు నుండి నిత్యం రెండు   సిమెంటు ఫ్యాక్టరీలకు పనికి వందల మంది పోయి వస్తుంటారు. జాన్ పాడు సైదులు దర్గా దగ్గరకు శుక్రవారం, ఆదివారం వేల మంది   భక్తులు వస్తూ  పోతూ   ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై రెండు మూలమలుపుల వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడి ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు గుంతలు కానరాక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున,ప్రమాదం జరగకముందే ఈ యొక్క గుంతల్ని పూడ్చల్సిందిగా సంబంధిత శాఖ వారిని ప్రజలు కోరుతున్నారు.b

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Submitted by Ramesh Peddarapu on Wed, 28/09/2022 - 10:05

పాలక వీడు,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): ఆచార్య కొండ  లక్ష్మణ్ బాపూజీ  జయంతి ఉత్సవాలను మండల ప్రజా పరిషత్ కార్యాలయం పాలకీడు నందు టి. వెంకట చారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి  పాలకీడు  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య  కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలల వేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలోమండల పంచాయతి అధికారి ఏ. దయాకర్,  టైపిస్టు  యన్. పిచ్చయ్య, అన్ని గ్రామాల పంచాయతి కార్యదర్శులు ,  కార్యాలయ సిబ్బంది  ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలకు ఐలమ్మ జీవితం స్ఫూర్తి దాయకం

Submitted by Ramesh Peddarapu on Tue, 27/09/2022 - 16:33

పాలక వీడు,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి): చాకలి ఐలమ్మ 125 వ జయంతి ఉత్సవాలను మండల ప్రజా పరిషత్ పాలకీడు నందు  మండల పరిషత్ అధ్యక్షులు  భూక్య గోపాల్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ  చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ రజాకార్ల ని ఎదిరించిన వీర వనిత ఐ లమ్మ ఆమె జీవితం నేటి మహిళలకు ఆదర్శం అని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీహరి, బెట్ట తండ సర్పంచ్ మోతిలాల్, టైపిస్టు  యన్. పిచ్చయ్య, కార్యాలయ సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

డెక్కన్ సిమెంట్స్ లో బతుకమ్మ పండుగ సంబరాలు

Submitted by Ramesh Peddarapu on Tue, 27/09/2022 - 15:53

పాలక వీడు,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి): ఆదివారం రోజు దసరా పండుగలో భాగమైన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని, సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, భవానిపురం కర్మాగారం  నందు బ్రతుకమ్మ పండుగను కాలనీ మహిళలు, పిల్లలు,పెద్దలు, అందరు కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు.,ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంస్థ వైస్ ప్రెసిడెంట్  యన్.శ్రీనివాస రాజు, సీ.జి.యం.  నాగ మల్లేశ్వర రావ్  లు మన తెలంగాణ మహోన్నత సంప్రదాయక  పండుగ బ్రతుకమ్మ విశిష్టతను,పవిత్రత గురించి అందరికీ వివరించారు.

చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

Submitted by Ramesh Peddarapu on Mon, 26/09/2022 - 13:12

పాలక వీడు,సెప్టెంబర్25(ప్రజా జ్యోతి):  తేది 24.092022  శని వారం రోజు  రాత్రి మఠంపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన సాకె నరేష్, వయస్సు 25 సం!! తన మేన మామ అయిన  సప్పర్ నర్సిహ్మ తో పాలకవీడు మండలము  రాఘవపురం గ్రామ సమీపంలో గల  వేములురు వాగు లో చేపలు పట్టుటకు  వెళ్లి      వల వేసి ప్రమాద వశాత్తు అట్టి వలలో చిక్కుకొని నీటి లో పడి  చనిపోగా విషయం తెలుసుకున్న  తన తండ్రి వెంకన్న ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా యస్ ఐ సైదులు తెలిపారు. మృతుడికి వివాహం కాలేదు

నిరంతర విద్యుత్ ఇచ్చి ఎండుతున్న పంట పొలాలు కాపాడాలి

Submitted by Ramesh Peddarapu on Fri, 23/09/2022 - 10:29

పాలకీడు, సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి) : పాలకీడు మండలంలోని నాగార్జునసాగర్ పదవ నెంబర్ కెనాల్ చివరి ఆయకట్టు భూములు  నిలువునా ఎండిపోతున్నాయి. సాగర్ ప్రధాన ఎడమ కాలువకు గండి పడిన చోట మరమ్మతులు  సుదీర్ఘకాలం చేయడంతో వరి పొలాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కంటి ముందు పచ్చటి పొలాలు ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు  అవుతున్నారు. మరోవైపు  24 గంటల ఉచిత విద్యుత్ అటకెక్కింది. అంతో ఇంతో నీటి ఆధారం ఉన్న రైతులు బోరు బావులను నడుపుకోవడానికి కరెంటు కోతలు శాపంగా మారాయి.

లిఫ్ట్ ఎత్తిపోతల పనులను ఆపాలని స్థానిక రైతులు ఆందోళన

Submitted by Ramesh Peddarapu on Fri, 23/09/2022 - 10:20

పాలక వీడు,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలం గుండే బోయిన గూడెం గ్రామ శివారులో తెలంగాణ ప్రభుత్వం పులిచింతల బ్యాక్ వాటర్ కృష్ణా నది సమీపాన నిర్మిస్తున్న ఎత్తిపోతల పనులకు స్థానిక రైతు, మండల టిఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లిఫ్ట్ నిర్మాణంలో తమ సొంత  భూములు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డామని, ప్రభుత్వం నుండి తాము కోల్పోతున్న భూమికి నష్టపరిహారం, ఏ సర్వే నెంబర్ లో  ఎంత భూమి పోతుందన్న వివరాలు పూర్తికాకముందే  పనులు చేపట్టడం ఏంటని నిర్మాణదారులను ప్రశ్నించారు. తక్షణమే పనులను ఆపాలని కోరారు.

విద్యుత్ మోటార్ దొంగిలించిన వ్యక్తి కి రిమాండ్ యస్ ఐ సైదులు

Submitted by Ramesh Peddarapu on Thu, 22/09/2022 - 13:20

పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి):1 8.09.2022   ఆది వారం    రోజు రాత్రి పాలక వీడు మండలం రాఘవాపురం గ్రామ శివారులోని వేములూరి వాగుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ గది తాళము పగలగొట్టి దానిలోని 1 హెచ్ పి మోటార్( 9 )ఎం సి బి స్విచ్లు లు , మూడు అల్యూమినియం పట్టీలను మీగడం  పాడు తండాకు చెందిన మూడు అనిల్ తండ్రి లకుపతి వయస్సు 22  సంవత్సరాలు,దొంగిలించగా లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగముగా అతనిని అరెస్టుచేసి అతని వద్ద నుండి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపనట్లుగా యస్ ఐ సైదులు తెలిపారు.