నాలుగేళ్లకు ముఖ్య మంత్రి కరునించినా అధికారులు వరమివ్వని దిస్తితి

Submitted by Ramesh Peddarapu on Tue, 20/09/2022 - 11:06
For four years, the chief minister did not give alms to the officials
  •  పైసలిస్తెనే ధరకాస్తు పై సంతకం?
  • కాసులకు కక్కుర్తి పడి వితంతువుల ధరకాస్తు పక్కకి పడేసిన అధికారులు.
  • ఒకే ఇంట్లో రెండు రావడం అవినీతికి అద్దం పడుతుంది.
  • వాస్తవంగా లబ్ది పొందాల్సిన వారికి అన్యాయం!
  • అడుగుతున్న బాధితులకు  రోల్ బ్యాక్,  టెక్నికల్ ప్రాబ్లెమ్ అని సమర్థించుకుంటన్న అధికారులు.

పాలక వీడు,సెప్టెంబర్19(ప్రజా జ్యోతి):  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లక్షల్లో కొత్త ఆసరా పెన్షన్ లక్షల్లో ఇచ్చామని పేపర్లలో లెక్కలు చూపిస్తుంటే.క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా వుంది. పాల కీడు మండలం లో మొత్తం 808 మందికి పెన్షన్ వచ్చినట్లు అధికారులు లెక్కలు చూపుతున్న అందులో వాస్తవంగా అర్హులైన వితంతువులు మాత్రం 4సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా వారి పేర్లు లిస్టులో రాకపోవడంతో మీడియా మిత్రుల తో  వాపోతున్నారు.2019 లో ధరకాస్తు చేసుకున్న వితంతులకి ఆసరా పెన్షన్ రాకపోవడం బాధాకరం.మండల అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.కాసులిస్తే తప్ప ఫైల్ కదలని సంగతి సదరు బాదితులకు తెలీక ముడుపులు చెల్లించలేదో? ఏమో పాపం వారి దరఖాస్తులు దుమ్ముపట్టి పక్కకి వున్నాయి.ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ధరకాస్తు పై మండల అధికారి సంతకం లేదని సాకు చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.భర్తను కోల్పోయిన స్త్రీలు కుటుంబాన్ని పోషించిందానికి ఆసరాగా వుంటుందని ఆశలు పెట్టుకుంటే అధికారులు మాత్రం అడియాషలు చేశారు.జెన్యూన్ గా లేని వారికి ,ఒకే ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ రావడం,వయస్సు తక్కువ వున్నా ఆధార్ మర్పించి చేసుకొన్న వారికి పెన్షన్ కార్డులు రావటం అధికారులు ఎంత ముడుపులు తీసుకున్నారో అర్దం అవుతుందని బాధితులు ఆరోపిస్తున్న్నారు.

  గతంలో వచ్చిన వారికి సైతం ఇప్పుడు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.అధికారులను అడిగితే రోల్ బ్యాక్ అంటూ ఏదో అంతు చిక్కని సమస్యలు చెప్పి ప్రజను వెనక్కు పంపిస్తున్నారు.పోని ఇప్పటికైనా వెంటనే ధరకాస్తు చేసుకుందామంటే సైట్ లేదంటున్న ఇంటర్నెట్ కేంద్రాలు.ఏంచేయాలో దిక్కుతోచక బాధితులు  వాపోతున్నారు.వెంటనే తమకు పెన్షన్ అందించాలని ఉన్నతాధికారులను,ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.