యాదాద్రి భువనగిరి

గ్రామాల్లో ఆరోగ్య అవగాహన సదస్సులు అంతంత మాత్రమే

Submitted by Uppala Dasharatha on Mon, 05/09/2022 - 11:57
  •  గ్రామాల్లో నామమాత్రంగానే డ్రైడే ఫ్రైడే
  • రోజురోజుకు పెరుగుతున్న వైరల్ జ్వరాలు
  • దొరికిన కాడికి దోచుకుంటున్న గ్రామీణ వైద్యులు

గుండాల సెప్టెంబర్ 04(ప్రజా జ్యోతి)   యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా అనేక వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైరల్ బారిన పడిన ప్రజలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోకుండా, ప్రభుత్వం ఉచితంగా అందించే మాత్రలు గ్రామంలోని గ్రామీణ వైద్యులను తీసుకోకుండా గ్రామాల్లోని గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.

పహిల్వాన్ పురం చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చాలి

Submitted by Sukka.ganesh on Sun, 04/09/2022 - 17:27

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్04(ప్రజాజ్యోతి న్యూస్) మండల పరిధిలోని పైల్వాన్ పురం చెరువును మినీ రిజర్వాయర్ గా చేసి గోదావరి జలాల తో నింపి పులిగిల్ల మీదుగా అడ్డగూడూరు వరకు రైతులకు సాగునీరు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా నిలుస్తా చలమల్ల కృష్ణారెడ్డి

Submitted by mallesh on Sun, 04/09/2022 - 17:16

చౌటుప్పల్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి రాజగోపాల్ రెడ్డి నీ నమ్మి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే,  గెలిపించిన ప్రజల మనోభావాలను గాలికి వదిలేసారని 22 వేల కోట్ల రూపాయలకు, అమ్ముడు పోయారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు.

ఆదివారం దేవలమ్మ నాగారం గ్రామంలో నిర్వహించిన, ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఇందిరమ్మ ఇల్లు, దళితులకు భూములు పంపిణీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.

పోచంపల్లి రమణారావుకు విశిష్ట జాతీయ సేవా రత్న అవార్డు

Submitted by krishna swamy on Sun, 04/09/2022 - 13:46

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 04 (ప్రజా జ్యోతి)శ్రీ రామకృష్ణ ట్రస్ట్ మరియు ప్రజ్ఞాభారతి ఫౌండేషన్ వారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భానుమూర్తి రామకృష్ణారావు హాజరయ్యారు. అనంతరం బ్రహ్మశ్రీ దైవజ్ఞశర్మ మాట్లాడుతూ సమాజంలో ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు వలన సమాజం బాగుపడుతుంది అన్నారు.

ఆ ముగ్గురు గుడిలో ఉన్న పూజారి బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తులు అన్నారు. ముగ్గురు సక్రమంగా లేనిపక్షంలో సమాజం చెడిపోతుంది అని వారి సందేశాన్ని ఇచ్చారు.

మునుగోడులో బిజెపి జెండా ఎగరడం ఖాయం

Submitted by mallesh on Sun, 04/09/2022 - 11:51

చౌటుప్పల్ సెప్టెంబర్ 3 ప్రజా జ్యోతి ; మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రమన గొని శంకర్ దిమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెం లో నిర్వహించిన, 43 వ భుత్ కార్యకర్తల సమావేశానికి, ముఖ్య అతిధులుగా రమన గొని శంకర్, మొగుదాల రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొగుదాల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూతు స్థాయిలో 60 శాతం ఓట్లు సాధించేలా కృషి చేసి, రాజగోపాల్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో  గెలిపించి, బిజెపి పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. 

డిజిటల్ టీవీలతో విద్యార్థులకు సులభతరం

Submitted by Sukka.ganesh on Sun, 04/09/2022 - 11:16

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి న్యూస్):డిజిటల్ టివిలలో పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని 28 ప్రభుత్వ పాఠశాలలకు దాత బండారు మయూర్ రెడ్డి సౌజన్యంతో అందజేసిన స్మార్ట్ టివిలను వారు పంపిణీ చేసి మాట్లాడుతూ స్మార్ట్ టీవీలతో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

భిక్షాటన చేసినా విఆర్ఏలు

Submitted by krishna swamy on Sat, 03/09/2022 - 17:35

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 03 (ప్రజా జ్యోతి)

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజులుగా జరుగుతున్న వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలకు సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు హాజరయి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లవారు మద్దతు ప్రకటించారు. అనంతరం మంచాల మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీ సాక్షిగా 2020 సంవత్సరంలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చి హామీని అమలు చేయకుండా తుంగలో తొక్కారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 17:27

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 02(ప్రజాజ్యోతి న్యూస్): మండల పరిధిలోని అరూర్ మదిర గ్రామం మత్స్యగిరి గుట్ట నివాసి సంగి అంజయ్య కిడ్ని ఆపరేషన్ కొరకు ఎమ్మెల్సీ వెలిమినేటి కృష్ణారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 60,000/-వేల రూపాయల చెక్కును శుక్రవారం జెడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బండారు నర్సింహారెడ్డి,పోలేపాక చెమ్మయ్య,ఆవుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

రైతు ను రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 16:55
  • మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి చౌటుప్పల్

సెప్టెంబర్ 2 ప్రజా జ్యోతి ; టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పేలా  మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని  గెలిపించి, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం కార్యకర్తలకు కృషి చేయాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన బిర్ల ఐలయ్య

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 16:48

ప్రజా జ్యోతి,  జిల్లా యాదాద్రి 

తుర్కపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిర్వధిక సమ్మెకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య శుక్రవారం మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి.ఆర్.ఏల పే స్కేల్ జి.ఓ వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వి.ఆర్.ఏ లకు పదోన్నతులు కల్పించాలన్నారు.55 సం||లు నిండిన వి.ఆర్.ఏల స్థానంలో వారసులకు వి.ఆర్.ఏ ఉద్యోగం ఇవ్వాలి డిమాండ్ చేసారు.