యాదాద్రి భువనగిరి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 11:55

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు భారత బాలకిషన్ కు 60,000 రూపాయలు చెక్కును  స్థానిక కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జాతీయ పోషణ అభియాన్ మహోత్సవాలు

Submitted by Sukka.ganesh on Tue, 13/09/2022 - 10:26

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 12 ప్రజాజ్యోతి ; న్యూస్:అభియాన్ పోషణ మహోత్సవాలలో భాగంగా సోమవారం ఐసిడిఎస్ రామన్నపేట వారి ఆధ్వర్యంలో వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్థానిక వైద్య అధికారి డాక్టర్ జ్యోతి పర్యవేక్షణలో కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించడం జరిగింది.

వెంకటేష్ కు గురుబ్రహ్మ అవార్డు ప్రదానం

Submitted by Sukka.ganesh on Tue, 13/09/2022 - 10:20

యాదాద్రి(ప్రజాజ్యోతి)సెప్టెంబర్ 12 ప్రజాజ్యోతి న్యూస్: మండల కేంద్రంలోని గాయత్రి ఉన్నత పాఠశాల డైరెక్టర్,ట్రస్మా అసోసియేట్ అధ్యక్షులు పాలకుర్ల వెంకటేష్ కు 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భముగా హైదరాబాద్ ఉప్పల్ లోని బచ్పన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో అబ్దుల్ కలాం లీడ్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఆచార్య సుదర్శన్ చేతుల మీదుగా గురుబ్రహ్మ అవార్డును సోమవారం వెంకటేష్ కు అందజేశారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడంతో తనకు మరింత భాద్యత పెరిగిందని అన్నారు.అవార్డు అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చిన్ననాటి మిత్రుల కలకు ప్రతిరూపమే అమ్మ యాది ఫౌండేషన్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:14

గుండాల10(ప్రజా జ్యోతి ; నేటి అమ్మ యాది పెండంఫౌండేషన్ బ్రాహ్మణపల్లి చిన్ననాటి మిత్రుల కలకు నిదర్శనమని  బాల్య మిత్రుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

గణపతి పూజలో పాల్గొన్న ఎస్ఐ యాకయ్య

Submitted by Uppala Dasharatha on Sat, 10/09/2022 - 14:39

గుండాల 09(ప్రజా జ్యోతి) యాదాద్రి జిల్లా గుండాల మండలం పరిధిలోనిసుద్దాల గ్రామంలో, ఉమ్మడి నల్గొండ మాజీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద   గుండాల ఎస్సై యాకయ్య గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక అతిధిని, పండరి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్సైని శాలువాతో సన్మానించారు.  ఈ కార్యక్రమం లో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు కొండపల్లి మోగులాల్ , మహోధయ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్, మహేందర్, సాజన్ ,చింకు, వినయ్ ప్రవీణ్ ,సందీప్, కృష్ణ, జంపి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం

Submitted by Sukka.ganesh on Thu, 08/09/2022 - 18:35

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 08 (ప్రజాజ్యోతి న్యూస్): గ్రామాలను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి పర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.గురువారం మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రారంభం,వలిగొండలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ నిధులతో 32 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను,7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్రారంభం,లోతుకుంట గ్రామంలో 25 లక్షలు ప్రత్యేక అభివృద్ధి నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంఖుస్థాపన,ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్

మునుగోడు గడ్డమీద బీజేపీ జెండా ఎగరవేస్తా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Submitted by mallesh on Mon, 05/09/2022 - 16:53

చౌటుప్పల్ సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి; కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, సీఎం కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి, తెలంగాణ రాష్ట్రం ను  నాశనం చేశాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన 18 వార్డ్ కౌన్సిలర్ కంశెట్టి శైలజ భాస్కర్  జిల్లా కాంగ్రెస్ నాయకుడు చింతల సాయిలు, చౌటుప్పల్ మాజీ వార్డు మెంబర్ కాసోజు గోవర్ధన్ చారి ,పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ శిర్క రాణి రంగారెడ్డి లతోపాటు పలువురు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలను సోమవారం బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆటో అడ్డాలను ఏర్పాటు చేయాలి

Submitted by krishna swamy on Mon, 05/09/2022 - 16:03
  • రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో ఆటో కార్మికుల ఆటోలకు ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటు చేయాలని రోడ్డు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం అన్నారు. ఆదివారం రోజున ఆటో కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలకు ప్రత్యేకంగా అడ్డా లేకపోవడంతో రోడ్డుమీద ఆటోలు నిలపడంతో దుకాణలదారులు వారిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.

పోచంపల్లిని విషాపు నీరు కమ్మేసింది

Submitted by krishna swamy on Mon, 05/09/2022 - 15:55
  • గోదావరి,కృష్ణ జలాల సాగు నీరు అందించాలి - సీపీఎం

 భూదాన్ పోచంపల్లి,సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) గోదావరి కృష్ణ జలాల సాగునీరు పోచంపల్లి ప్రాంతానికి అందించాలని సోమవారం రోజున సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించరు. ఈ సందర్భంగా ఆర్.ఐ వెంకట్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.