పోచంపల్లిని విషాపు నీరు కమ్మేసింది

Submitted by krishna swamy on Mon, 05/09/2022 - 15:55
Pochampalli was eaten by poisonous water
  • గోదావరి,కృష్ణ జలాల సాగు నీరు అందించాలి - సీపీఎం

 భూదాన్ పోచంపల్లి,సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) గోదావరి కృష్ణ జలాల సాగునీరు పోచంపల్లి ప్రాంతానికి అందించాలని సోమవారం రోజున సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించరు. ఈ సందర్భంగా ఆర్.ఐ వెంకట్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి పగిళ్ళ లింగారెడ్డి ,పట్టణ కార్యదర్శి కోడె బలనరసింహలు మాట్లాడుతూ పోచంపల్లి ప్రాంతాన్ని విషాపు నీరు కమ్మేసింది ఏండ్ల తరబడి గత్యంతరం లేక ప్రజలు ఈ నీటినే వాడుతు పంటలు పండిస్తున్నారు అని ఒక వైపు బువ్వ పెట్టె భూమి విషం చిమ్ముతుంటే మరో వైపు ప్రజల ప్రజారోగ్యం పశు మత్స్య సంపద జీవజాలం యొక్క మనగడ ప్రశ్నార్థకంగా మారింది 40 సంవత్సరాల క్రితం త్రాగునీటి అవసరాలు తీర్చిన మూసి ఇప్పుడెందుకు మురికి కుపంగా మారిందో పాలకులు సమాధానం చెప్పాలి అన్నారు.

మూసి కాలుష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతిని రకరకాల క్యాన్సర్లు కిడ్నీ జబ్బులు చర్మ వ్యాధులు గర్భస్రావాలు అర్థ టైస్ గొంతు నొప్పి కడుపునొప్పి వింత వ్యాధులతో వెలకట్టలేని నష్టం జరుగుతుందని ప్రజా ఆరోగ్యాన్ని కి హానికరం అని తెలిసిన విషపు నీటితోనే పంటలు పండించడం తప్పడం లేదు మూసి కాలుష్యం వల్ల జీవరాసులు కూడా ఇబ్బంది పడుతున్నాయని అందుకే మూసి ప్రక్షాళన వెంటనే చేపట్టాలి అన్నారు. ఫిరంగినాల వద్ద కాలువలను పునరుద్ధరించి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నుండి గొలుసు కట్టు చెరువుల ద్వారా పోచంపల్లికి నీరు అందించే చర్యలు చేపట్టి గోదావరి జిల్లాలను పోచంపల్లి మండలానికి శామీర్పేట చెరువు నుండి రాంపల్లి ఘట్కేసర్ ఆదిలాబాద్ మీదుగా పిల్లలకు తేవాలని మూసి పరిహార ప్రాంతంలో పోచంపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటి సర్వే నిర్వహించి ఈ ప్రాంతాన్ని పరిగణించాలని ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి,సింగల్ విండో డైరెక్టర్ అందెల జ్యోతి ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్ర రెడ్డి మంచాల మధు ,ప్రసాదం విష్ణు బుచ్చిరెడ్డి  మండల కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి ,లాలయ్య, బిక్షపతి, సాయి, మండల పట్టణ కమిటీ సభ్యులు నాయకులు, అందేలా అశోకు ,పత్తి బిక్షపతి ,జంగారెడ్డి, అనిల్ రెడ్డి, జగన్, సుధాకర్ రెడ్డి, గిరమోని అంజనేయులు ,జ్జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.