చిన్ననాటి మిత్రుల కలకు ప్రతిరూపమే అమ్మ యాది ఫౌండేషన్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:14
Amma Yadi Foundation is a reflection of the dream of childhood friends

గుండాల10(ప్రజా జ్యోతి ; నేటి అమ్మ యాది పెండంఫౌండేషన్ బ్రాహ్మణపల్లి చిన్ననాటి మిత్రుల కలకు నిదర్శనమని  బాల్య మిత్రుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమ్మ యాది పెండెం ఫౌండేషన్ ద్వారా కవులను కళాకారులను సన్మానించడం అభినందనీయమని  జాతీయ సినీ గేయ ఉత్తమ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు.శనివారం బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో పెండెం  పౌండేషన్ పెండెం  సోమక్క సత్తయ్య జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అమ్మ యాది  11 వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ యువత ఉన్నత స్థాయికి ఎదిగి పుట్టిపెరిగిన గ్రామం తల్లిదండ్రులను గురువులను మరువకూడదని .తెలంగాణ రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మ యాది ఫౌండేషన్ చేసిన సేవలు మరువలేనివని ప్రతి ఒక్కరూ పెండెం  కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించు కోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాలోజి నారాయణ అవార్డు గ్రహీత హరగోపాల్ కు జీవిత సాఫల్య అవార్డు అందజేస్తూ ఘనంగా సన్మానించారు.సినీ గేయ రచయిత జయరాజ్ మాట్లాడుతూ ఈ రోజులలో తల్లిదండ్రులను గుర్తు చేయలేని యువత అమ్మ యాది సేవలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

తల్లిదండ్రులపై పాట పాడి సభికులను ఉత్తేజ  పరిచాడు.అనంతరం ఆహ్వానితులకు శాలువా జ్ఞాపిక ల తో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో  పెండెం ఫౌండేషన్ చైర్మన్ పెండెం సత్యనారాయణ లక్ష్మి,పరంధాములు రామచంద్రు ,జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్,స్థానిక సర్పంచ్ బండారు సంధ్యా శ్రీనివాస్,ఎంపీటీసీ పాయిలి కవిత శ్రీనివాస్,ప్రముఖ కవి  రచయిత పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.