పోరాట స్ఫూర్తి వనిత చాకలి ఐలమ్మ

Submitted by krishna swamy on Sat, 10/09/2022 - 16:10
 Fighting spirit Vanita Chakali Ailamma

ఘనంగా బిబినగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

బిబినగర్, సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)  .బీబీనగర్ మండల కేంద్రంలో తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు కృషిచేసిన స్ఫూర్తి వనిత చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విరవనిత చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గాండ్ల అశోక్ టిఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల బాలరాజ్. సౌత్ జోన్ జనరల్ సెక్రెటరీ గొలనుకొండ భాస్కర్. రోడ్డ అనిల్. మండల యువజన అధ్యక్షులు గోరుకంటి వేణు, రాంపల్లి అంజయ్య, గాండ్ల నాగేష్, గాండ్ల కృష్ణ, భాస్కర్, శీను తదితరులు పాల్గొన్నారు.