గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం

Submitted by Sukka.ganesh on Thu, 08/09/2022 - 18:35
Development of villages is the responsibility of the state government

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 08 (ప్రజాజ్యోతి న్యూస్): గ్రామాలను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి పర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.గురువారం మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రారంభం,వలిగొండలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ నిధులతో 32 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను,7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్రారంభం,లోతుకుంట గ్రామంలో 25 లక్షలు ప్రత్యేక అభివృద్ధి నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంఖుస్థాపన,ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ను స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంబించి మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో పేదలకు అందజేస్తున్నారని,గ్రామాలను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి పర్చడమే ద్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజ్,జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కూనపురి కవిత రాములు,రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ పనుమటి మమతా నరేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి,సర్పంచులు కొమిరెల్లి సరిత సంజీవ రెడ్డి,రాచకొండ బచ్చయ్య,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి,మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్ రెడ్డి,సర్పంచ్ గూడూరు శివశాంత్ రెడ్డి,ఎంపిటిసిలు నోముల మల్లేష్,పలుసం రమేష్,మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి,బిసి సెల్ మండల అధ్యక్షులు అయిటిపాముల ప్రభాకర్,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెలిమినేటి సత్యనారాయణ,పోలేపాక సత్యనారాయణ నాయకులు డేగల పాండు,గంగదారి రాములు,అయిటిపాముల సత్యనారాయణ,మాధ శంకర్ గౌడ్,ఆవుల నర్సింహా,ఆకుల వెంకటేశం,గంగారం రమేష్,కాశిమల్ల శేఖర్,స్వామి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.