పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికిన వేదపండితులు
తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి :
పదకొండు లక్షల యాభై వేల సంతకాల సేకరణలో జైభారత్ కార్యకర్తల కృషి అపూర్వం : శ్రీ విజయ శంకర స్వామి
పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 09 : తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి అధ్వర్యంలో సంయుక్తంగా గత నెల రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర బుధవారం ఉదయం కొడకండ్ల మండలంల