Choutuppal

ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి

Submitted by mallesh on Wed, 14/09/2022 - 10:54

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి  ..మునుగోడు ఉప ఎన్నిక  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  స్రవంతి రెడ్డి రెడ్డి నియమకం అనంతరం మంగళవారం మొట్టమొదటిసారి నియోజకవర్గం చౌటుప్పల్ లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్వాయి స్రవంతి కి ఘన స్వాగతం పలికారు.  దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వీరనారి చాకలి ఐలమ్మ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బొమ్మగాని ధర్మ బిక్షం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Submitted by mallesh on Tue, 06/09/2022 - 14:09

చౌటుప్పల్  సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.   చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రత్న నగర్ లో ఉన్న ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ సలహాదారులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లెంకల మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి  విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపారు. విద్యార్థులు ఒకేషనల్ కళాశాలలో విద్యను అభ్యసించినట్లయితే తొందరగా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

మునుగోడు గడ్డమీద బీజేపీ జెండా ఎగరవేస్తా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Submitted by mallesh on Mon, 05/09/2022 - 16:53

చౌటుప్పల్ సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి; కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, సీఎం కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి, తెలంగాణ రాష్ట్రం ను  నాశనం చేశాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన 18 వార్డ్ కౌన్సిలర్ కంశెట్టి శైలజ భాస్కర్  జిల్లా కాంగ్రెస్ నాయకుడు చింతల సాయిలు, చౌటుప్పల్ మాజీ వార్డు మెంబర్ కాసోజు గోవర్ధన్ చారి ,పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ శిర్క రాణి రంగారెడ్డి లతోపాటు పలువురు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలను సోమవారం బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు.

అక్రమ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు నిలిపివేయాలి

Submitted by mallesh on Mon, 05/09/2022 - 11:45

 చౌటుప్పల్ సెప్టెంబర్ 4 ప్రజాజ్యోతి  , మండలంలోని దండ మల్కాపురం గ్రామం సర్వే నెంబర్ 242, 243 లో 0-36 గుంటల వ్యవసాయ భూమి లో అక్రమంగా నిర్మిస్తున్న  హై టెన్షన్ విద్యుత్ టవర్స్ ను నిర్మాణ పనులు నిలిపివేయాలని   ఆదివారం భూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అక్రమ విద్యుత్ నిర్మాణాలు చేపడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు, రైతు ఐలయ్య మాట్లాడుతూ చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన  పోచయ్య పేరుమీద 1954 సంవత్సరం కాలం నుండి సర్వేనెంబర్ 242, 243 గల భూమిలో 36 గుంటల భూమి ఉందని పేర్కొన్నారు.

కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా నిలుస్తా చలమల్ల కృష్ణారెడ్డి

Submitted by mallesh on Sun, 04/09/2022 - 17:16

చౌటుప్పల్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి రాజగోపాల్ రెడ్డి నీ నమ్మి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే,  గెలిపించిన ప్రజల మనోభావాలను గాలికి వదిలేసారని 22 వేల కోట్ల రూపాయలకు, అమ్ముడు పోయారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు.

ఆదివారం దేవలమ్మ నాగారం గ్రామంలో నిర్వహించిన, ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఇందిరమ్మ ఇల్లు, దళితులకు భూములు పంపిణీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.

మునుగోడులో బిజెపి జెండా ఎగరడం ఖాయం

Submitted by mallesh on Sun, 04/09/2022 - 11:51

చౌటుప్పల్ సెప్టెంబర్ 3 ప్రజా జ్యోతి ; మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రమన గొని శంకర్ దిమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెం లో నిర్వహించిన, 43 వ భుత్ కార్యకర్తల సమావేశానికి, ముఖ్య అతిధులుగా రమన గొని శంకర్, మొగుదాల రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొగుదాల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూతు స్థాయిలో 60 శాతం ఓట్లు సాధించేలా కృషి చేసి, రాజగోపాల్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో  గెలిపించి, బిజెపి పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. 

రైతు ను రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 16:55
  • మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి చౌటుప్పల్

సెప్టెంబర్ 2 ప్రజా జ్యోతి ; టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పేలా  మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని  గెలిపించి, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం కార్యకర్తలకు కృషి చేయాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

కుల వివక్షతను నిర్మూలించాలి ఎంఆర్ఓ పార్థసింహారెడ్డి

Submitted by Sathish Kammampati on Tue, 30/08/2022 - 17:51

చౌటుప్పల్ ఆగస్టు 30 ప్రజా జ్యోతి ; ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల ప్రజలు కుల మత వర్గ లింగ విభేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలని ఎమ్మార్వో పార్థసింహారెడ్డి అన్నారు.

గురువారందేవలమ్మ నాగారం గ్రామంలో నవయుగ అంబేద్కర్ యువజన సంఘం ఆవరణంలో  పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన, కార్యక్రమంలో ఎమ్మార్వో పార్థ సింహ రెడ్డి, సిఐ నేతి శ్రీనివాస్ పాల్గొని కుల వివక్షతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగాసిఐ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా అన్ని కులాల ప్రజలు సోదర భావంతో మెలుగుతూ అంటరాని తనాన్ని నిర్మూలించాలన్నారు.