Choutuppal

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Submitted by mallesh on Sat, 17/09/2022 - 16:51

సెప్టెంబర్ 17 ప్రజా జ్యోతి. తెలంగాణ సమాజం నిజాం కబంధహస్తాల నుండి విమోచన పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవం సందర్భంగా శనివారం అల్లాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఎగరవేశారు.

భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన చైర్మన్ వెన్ రెడ్డి రాజు కౌన్సిలర్ వనజ అనిల్

Submitted by mallesh on Sat, 17/09/2022 - 16:34

చౌటుప్పల్ సెప్టెంబర్ 17 ప్రజా జ్యోతి //. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని అన్ని వార్డులు సమగ్ర అభివృద్ధిని సాధిస్తాయని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి 5 వ , వార్డులో భూగర్భ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు స్థానిక కౌన్సిలర్ వనజ అనిల్ లు శంకుస్థాపన చేశారు. అనంతరం  కౌన్సిలర్ వనజ అనిల్ వార్డులోని పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కౌన్సిలర్ శ్రీధర్ బాబు

Submitted by mallesh on Sat, 17/09/2022 - 10:47

చౌటుప్పల్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి . మున్సిపల్ కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పూర్తి  చేస్తామని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 11 వార్డులో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం కు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు స్థానిక కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు  లు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు, ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, త్వరితగతిన సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరుస్తానన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by mallesh on Fri, 16/09/2022 - 14:23

చౌటుప్పల్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి . తెలంగాణ  నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం దేశానికే గర్వకారణం అని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు,  నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి కెసిఆర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పెట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, శుక్రవారం చౌటుప్పల్  లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్  పార్టీ నాయకులు  పాలాభిషేకం నిర్వహించారు.

దోచుకున్న ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న టిఆర్ఎస్ బిజెపి పార్టీలు

Submitted by mallesh on Fri, 16/09/2022 - 11:19

మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చౌటుప్పల్ సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఎనిమిదేళ్ల పరిపాలనలో మునుగోడు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోచుకున్న ప్రజాధనాన్ని బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు మునుగోడు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి వాడుకుంటున్నాయన్నారు. మునుగోడుకు బిజెపి ప్రభుత్వం  ఏం చేసిందని ఎద్దేవా చేశారు.

రద్దుచేసిన చేనేత సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి .మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు

Submitted by mallesh on Thu, 15/09/2022 - 17:13

చౌటుప్పల్ సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి  . సంక్షేమ సహకార వ్యవస్థ, సహకార రంగాలను అంబానీ ఆదాని కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాలు అన్నారు, చేనేత పై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన  చేనేత సంక్షేమ  బోర్డును తక్షణమే, పునర్దలించాలన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన పాల్వాయి స్రవంతి రెడ్డి

Submitted by mallesh on Thu, 15/09/2022 - 11:01

చౌటుప్పల్ సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి. ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మరణించిన  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగారెడ్డి గూడెం కు చెందిన తూర్పునూరు హనుమంత్ గౌడ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేశారు. ఆర్థిక సహాయంగాను 10 వేల రూపాయలను  మృతుడు హనుమంతు గౌడ్ కుటుంబ సభ్యులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో  సుర్వి నరసింహ గౌడ్, లందగిరి భీమయ్య, ఊదరి శ్యామ్ సుందర్, చెరుకు లింగస్వామి , సుక్క కృష్ణ, చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

Submitted by mallesh on Wed, 14/09/2022 - 16:58

చౌటుప్పల్ సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి  . బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అండగా ఉంటారని  ఏదుళ్ళు అరవింద్ రెడ్డి అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికిన అయోధ్య యాదవ్

Submitted by mallesh on Wed, 14/09/2022 - 15:53

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి ;  గొల్ల కురుమల సంక్షేమంతో పాటు మాంసం ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపక  కార్యక్రమాన్ని ప్రారంభించారని సినీ ఫోటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.బుధవారం మునుగోడు మండలం కృష్టపురం గ్రామంలో. గొర్రెల వ్యాక్సిన్ పంపిణీ చేపల పంపిణీ కార్యక్రమానికి వెళుతున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్  దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ లకు, బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. 

తెలంగాణ విమోచన దినోత్సవం స్ఫూర్తిదాయక దినోత్సవం

Submitted by mallesh on Wed, 14/09/2022 - 15:20

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి నిజం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ కు విముక్తి కలిగించిన, సాయుధ పోరాట అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాడాలని, బీజేవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్ కన్వీనర్ దిండు భాస్కర్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 13 నుండి 17 వరకు  నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడపల్లి నుంచి  నేషనల్ హైవే 9 మీదుగా లక్కారం వరకు సుమారు 200 మంది బీజేవైఎం కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర క్రీడ కన్వీనర్ ఆలే చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం ఒక స్ఫూర్తిదాయక దినోత్సవం అన్నారు.