ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by mallesh on Fri, 16/09/2022 - 14:23
 Palabhishekam for the portrait of Chief Minister KCR

చౌటుప్పల్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి . తెలంగాణ  నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం దేశానికే గర్వకారణం అని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు,  నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి కెసిఆర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పెట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, శుక్రవారం చౌటుప్పల్  లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్  పార్టీ నాయకులు  పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్ని రంగాలలో సమానమైన గౌరవం దక్కాలని, అంబేద్కర్ ఆశయాన్ని అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రకులాల పేదలకు మనవియ  పాలన అందిస్తూ ,అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, గుండెబోయిన వెంకటేష్ యాదవ్, కానుగుల వెంకటయ్య , ఖానా చైర్మన్ ఎండి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.