రద్దుచేసిన చేనేత సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి .మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు

Submitted by mallesh on Thu, 15/09/2022 - 17:13
The dissolved Handloom Welfare Board should be restored immediately  Former MLC Cherupalli Sitaramulu

చౌటుప్పల్ సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి  . సంక్షేమ సహకార వ్యవస్థ, సహకార రంగాలను అంబానీ ఆదాని కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాలు అన్నారు, చేనేత పై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన  చేనేత సంక్షేమ  బోర్డును తక్షణమే, పునర్దలించాలన్నారు. వస్త్ర తయారీ కంపెనీలను తట్టుకొని, చేనేత వ్యవస్థ పని చేయాలంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేయాలన్నారు, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం నూతన సంక్షేమ పథకాలను తీసుకురావాలని పేర్కొన్నారు. ఆరోగ్య భీమా మార్కెట్ అభివృద్ధి సహాయపదకం, చేనేత కార్మికుల హౌస్ ఫ్రమ్ వర్క్ షెడ్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం నరసింహ, గర్దాసు బాలయ్య, కందగట్ల బిక్షపతి, బడుగు శంకరయ్య, శ్రీనివాస్ ,బడుగు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.