దోచుకున్న ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న టిఆర్ఎస్ బిజెపి పార్టీలు

Submitted by mallesh on Fri, 16/09/2022 - 11:19
TRS BJP parties ready to spend looted public money

మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చౌటుప్పల్ సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఎనిమిదేళ్ల పరిపాలనలో మునుగోడు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోచుకున్న ప్రజాధనాన్ని బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు మునుగోడు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి వాడుకుంటున్నాయన్నారు. మునుగోడుకు బిజెపి ప్రభుత్వం  ఏం చేసిందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, సమిష్టి కృషితో మునుగోడు గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. 2023 సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతి టిఆర్ఎస్ మతతత్వ బిజెపి పార్టీలను ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలంతా రెండు మాసాలు మునుగోడు ఎన్నికలపై దృష్టి సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి. మునుగోడు  సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి. రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి. ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రవీందర్ . డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, భీమిడి ప్రదీప్ జి కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.