Choutuppal

కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

Submitted by mallesh on Wed, 21/09/2022 - 14:47

చౌటుప్పల్ సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి) ../ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి వేడుకలు బుధవారం చౌటుప్పల్ లో ఘనంగా నిర్వహించారు. చిన్న కొండూరు రోడ్డు లోని, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి , మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు లు పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, బడుగు మాణిక్యం ,మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, గోశిక స్వామి, గోశిక కరుణాకర్, నారాయణపూర్ మాజీ జెడ్పిటిసి శివశంకర్ ,కందగట్ల బిక్షపతి తదితరులు.

వినతి పత్రం అందజేత

Submitted by mallesh on Wed, 21/09/2022 - 12:43

 చౌటుప్పల్ సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) .. విద్యా అర్హత కలిగిన కారోబార్లను గ్రామపంచాయతీ కార్యదర్శులుగా నియమించాలంటూ  మంగళవారం చౌటుప్పల్ లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి యాదాద్రి భువనగిరి జిల్లా కారోబార్ల కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

*కుల, మతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Submitted by mallesh on Wed, 21/09/2022 - 12:13

చౌటుప్పల్ సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి)../  ప్రపంచం అద్భురపడే విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడనిరాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అగ్రవర్గాల చేతిలో మునుగోడు ప్రజలు అణచివేతకు గురవుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Submitted by mallesh on Wed, 21/09/2022 - 12:05

చౌటుప్పల్ సెప్టెంబర్ 20( ప్రజా జ్యోతి) .../ అగ్రవర్గాల ఆధిపత్య పోరు లో గత 75 సంవత్సరాలు మునుగోడు నియోజకవర్గ ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రెండో విడత రాజ్యాధికార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఆందోళన మైసమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  పాదయాత్ర ప్రారంభించారు. బిఎస్సి పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బీఎస్పీ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు.

ధన బలం కలిగిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ ప్రజాబలం ముందు తలవంచక తప్పదు గీతారెడ్డి

Submitted by mallesh on Tue, 20/09/2022 - 11:00

చౌటుప్పల్ సెప్టెంబరు 19( ప్రజా జ్యోతి): బిజెపి టిఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ఎండగాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా బూత్ కమిటీ అధ్యక్షులు పనిచేయాలని  వర్కింగ్ ప్రెసిడెంట్ గీత రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో ప్రచారం చేపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

సిఎన్జి గ్యాస్ ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించండి సుంద రేషన్

Submitted by mallesh on Mon, 19/09/2022 - 16:09

చౌటుప్పల్ సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి .../   పర్యావరణాన్ని పరిరక్షించి వాయు కాలుష్యం తగ్గించడానికి పెట్రోలు డీజిల్ స్థానంలో సీఎన్జీ గ్యాస్ ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గించవచ్చని జాయింట్ చీఫ్ కంట్రోల్ ఎక్స్ ప్లోజివ్స్ సుంద రేషన్ అన్నారు. జాతీయ రహదారి 65 యెల్లగిరి స్టేజి వద్ద ఏర్పాటుచేసిన సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పగిళ్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సిఎన్జి ఉపయోగించడం వలన వాయు  కాలుష్యాన్ని నియంత్రించి, కేజీ సిఎన్జి గ్యాస్ 22 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని పొందవచ్చు అని  పేర్కొన్నారు.వాయు కాలుష్యం నియంత్రించడం కోసం వాహనదారులు సిఎన్జ

నేడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Submitted by mallesh on Mon, 19/09/2022 - 14:57

 చౌటుప్పల్ సెప్టెంబర్ 18;;  టిఆర్ఎస్ పార్టీ  పదివేల మంది పట్టణ గ్రామాల కార్యకర్తలతో  మంగళవారం నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళన సమావేశం పనులను మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.

స్రవంతి రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

Submitted by mallesh on Mon, 19/09/2022 - 11:56

చౌటుప్పల్ సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి..   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి  గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుల పని చేయాలని  సూర్యాపేట వరంగల్  జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న నాయిని రాజేందర్ రెడ్డిలు అన్నారు. ఆదివారం చౌటుప్పల మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో నిర్వహించిన, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మునుగోడు గడ్డమీద కాంగ్రెస్ జెండా  ఎగరవేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కీలకపాత్ర వహించాలన్నారు.

మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశం

Submitted by mallesh on Mon, 19/09/2022 - 11:40
  • ఆర్టీసీ కార్మికులు ఆత్మ గౌరవం చంపుకుని పనిచేస్తున్నారు 
  • సమస్యలు పరిష్కరించకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం

చౌటుప్పల్ సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి//. పెండింగులో ఉన్న 2 పే స్కేల్ 6 డిఏ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ కార్మికుల కన్వీనర్ కె రాజిరెడ్డి అన్నారు.ఆదివారం  చౌటుప్పల్ నిర్వహించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరి

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం

Submitted by mallesh on Mon, 19/09/2022 - 11:30

చౌటుప్పల్ సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి ../  జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 6 నుండి 10% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కటించడాని హర్షం వ్యక్తం చేస్తూ, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యాడ్ ఆవరణంలో సీఎం కేసీఆర్ చత్రపటానికి గిరిజనులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనగంటి తండా సర్పంచ్ సేవాలాల్ చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షుడు నరసింహ నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసీల సమస్యలను తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, ఏండ్ల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటూ ,జీవనం సాగిస్తున్న గిరిజన ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చూపుతూ, 148 జీవో ద్వారా  పట్టాలు ఇస్తానని హామీ ఇ