అక్రమ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు నిలిపివేయాలి

Submitted by mallesh on Mon, 05/09/2022 - 11:45
Construction of illegal power towers should be stopped

 చౌటుప్పల్ సెప్టెంబర్ 4 ప్రజాజ్యోతి  , మండలంలోని దండ మల్కాపురం గ్రామం సర్వే నెంబర్ 242, 243 లో 0-36 గుంటల వ్యవసాయ భూమి లో అక్రమంగా నిర్మిస్తున్న  హై టెన్షన్ విద్యుత్ టవర్స్ ను నిర్మాణ పనులు నిలిపివేయాలని   ఆదివారం భూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అక్రమ విద్యుత్ నిర్మాణాలు చేపడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు, రైతు ఐలయ్య మాట్లాడుతూ చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన  పోచయ్య పేరుమీద 1954 సంవత్సరం కాలం నుండి సర్వేనెంబర్ 242, 243 గల భూమిలో 36 గుంటల భూమి ఉందని పేర్కొన్నారు.  వంశపారపర్యంగా ఉన్న భూమి తాతల కాలం నుండి ఉందని, ఎటువంటి నోటీసులు లేకుండా తమ వ్యవసాయ భూమి లో విద్యుత్ హై టెన్షన్  టవర్ నిర్మాణం చేయడానికి రైతులకు అడ్డుకున్నారు. టవర్ నిర్మాణ పనులు చేస్తున్న యాజమాన్యం కు రైతులకు మధ్య తివ్ర వాగ్వాదం జరిగింది.

విషయం తెలుసుకొని సంఘటన చలానా చేరుకున్న పోలీసులు ఇరువురికి నచ్చజెప్పి ఘర్షణ శాంతింప చేశారు.రైతు లు ఫోన్లో ఆర్డీవో సూరజ్ కుమార్ కు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో, రైతులు సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రైతులు  వెంకటేష్, నాగార్జున, కృష్ణ,బుచ్చయ్య, సురేష్, నరసింహ, శ్రీను, కిష్టయ్య, లింగస్వామి, ఆగయ్య ,ఆంజనేయులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.