నడిగూడెం

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Submitted by Upender Bukka on Tue, 20/09/2022 - 10:57

నడిగూడెం, సెప్టెంబర్ 19, ప్రజా జ్యోతి: మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  సోమవారం  ధర్నా నిర్యహించారు.   ఈ సందర్భంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్, జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజల సమస్యల మీద సర్వే చేసి  సమస్యలు గుర్తించినట్లు తెలిపారు.

దళిత బాంధవుడు సి.యం కేసీఆర్. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు.

Submitted by Upender Bukka on Mon, 19/09/2022 - 11:48

నడిగూడెం, సెప్టెంబర్ 18, ప్రజా జ్యోతి:   దళిత  బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు  అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు. అనంతరం  సి.యం, మంత్రి, ఎం.యల్.ఏ ల చిత్ర  పటాలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ సెక్రటేరియట్ కు గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్  పేరు నామకరణం చేయటం,
యస్.టి లకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు, ప్రకటించినసి.యం దళిత  బాంధవుడుగా ఎప్పటికి చరిత్రలో  నిలిసి పోతారని  చెప్పారు.

ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట

Submitted by Upender Bukka on Sat, 17/09/2022 - 11:49

పేదింటి ఆడ పడుచులకు మేనమామ 

అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారుఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ 

అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:47

నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజాజ్యోతి: నడిగూడెం మండలం పరిధిలోని వేణుగోపాలపురం గ్రామములో  రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అనేకమందికి అర్హులైన వారికి పింఛను రావట్లేదని ఆన్లైన్  ఓపెన్ చేసి అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు.

నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.ఎం.పి.పి యాతాకుల జ్యోతి మధుబాబు

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:44

నడిగూడెం, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి: నులిపురుగుల నిర్మూలన కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఎంపి.పి  యాతాకుల జ్యోతి మధుబాబు, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న తెలిపారు.నడిగూడెం  గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూచిన్నపిల్లలకు తరచుగా కడుపునొప్పి రావడం , ఏకాగ్రత లోపించడం వాటి కారణం కడుపు లోని నులిపురుగులని అన్నారు. నులి పురుగుల నిర్మూలన కొరకు 1 నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Submitted by shaikmohammadrafi on Fri, 16/09/2022 - 10:18

నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజాజ్యోతి: పిల్లల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా చూసుకుంటుందని  జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా  చాకిరాల గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్   జాతీయ నిలిపురుగుల దినోత్సవం కార్యక్రమం ప్రారంభించి పాల్గొని మాట్లాడారు.

గ్యాస్ తూకంలో ఎలాంటి తేడాలుండవు.డీలర్ చిల్లంచర్ల వినీత

Submitted by shaikmohammadrafi on Thu, 15/09/2022 - 16:28


నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజా జ్యోతి: గ్యాస్ వినియోగ దారులకు తెలియ జేయునది మీరు గ్యాస్ డెలివరి తీసుకునే సమయంలో మీకు  గ్యాస్ బండ  డెలివరీ  చేసే  వాహనంలో   కాటా ఉంటుందని దయచేసి గ్యాస్ తీసుకునే ముందు వినియోగదారులు  గ్యాస్ సిలిండర్ ని తూకం వేసి తీసుకోవాలని  శ్రీ సాయి రమ్య  ఇండియన్ గ్యాస్ డీలర్ చిల్లంచర్ల వినీత గురువారం పత్రికల ద్వారా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఏదయినా గ్యాస్ సిలిండర్ తూకంలో తేడాలు ఉంటే  సిలిండర్ ని మార్చి ఇవ్వటం జరుగుతుందని. తెలిపారు.గ్యాస్ వినియోగదారులు ఇది గమనించాలని  ఎటువంటి అపోహలకు  పెట్టుకోవద్దని  వినియోగదారులను కోరారు..

నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎం.పి.పి యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Thu, 15/09/2022 - 15:13

నడిగూడెం, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి: నులిపురుగుల నిర్మూలన కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఎంపి.పి  యాతాకుల జ్యోతి మధుబాబు, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న కోరారు.నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలకు తరచుగా కడుపునొప్పి రావడం , ఏకాగ్రత లోపించడం వాటి కారణం కడుపు లోని నులిపురుగులు అని అన్నారు. నులి పురుగుల నిర్మూలన కొరకు ఒకటి నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Submitted by Upender Bukka on Thu, 15/09/2022 - 10:21

నడిగూడెం, సెప్టెంబర్ 14 ,ప్రజా జ్యోతి:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం పరిధిలోని 1 నుంచి 19 సంవత్సరాల బాల, బాలికలకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు బుధవారం సంబందిత వైద్య సిబ్బంది తో జరిగిన సమావేశంలో  మాట్లాడుతూచిన్నారులకు ఆల్బెండజోల్  ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఈనెల 15వ తారీకున నిర్వహించే  కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు ,అంగన్వాడీ, కార్యకర్తలకు సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.