నడిగూడెం

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి..

Submitted by shaikmohammadrafi on Mon, 26/09/2022 - 13:14

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి.

 ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..

వెంకటరెడ్డి మరణం గ్రామానికి తీరని లోటు.. కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి...

Submitted by shaikmohammadrafi on Sun, 25/09/2022 - 11:33

నడిగూడెం, సెప్టెంబర్ 24, ప్రజా జ్యోతి: మండలంలోని, రామా పురం లో   నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాజీ చైర్మన్ స్వర్గీయ బూతుకూరి పెద వెంకట రెడ్డి  సంతాప సభ  శనివారం  రామాపురం  గ్రామంలో కుటుంబం సభ్యులు నిర్యహించగా సంతాప సభ లో కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి  పాల్గొని, ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంక రెడ్డి నీతి నిజాయితీగా నిబద్ధతకు మారుపేరుగా తన రాజకీయ జీవితం గడిపారని గ్రామాభివృద్ధికి  ఎంతో కృషి చేశారన్నారు.

ఎమ్మెల్యే కృషితో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం... ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Sat, 24/09/2022 - 12:20

నడిగూడెం, సెప్టెంబర్ 23, ప్రజా జ్యోతి:  నడిగూడెం నుండి రత్నవరం  వరకు చేపట్టిన బీటి రోడ్డు పనులు  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కృషితో మంజూరైనట్లు పనులను యుద్ధ యుద్ధ ప్రాతి పథకన ప్రారంభించడం చాలా సంతోషకరమని. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా మండలంలోని అనేక గ్రామాల నుండి మండల కేంద్రానికి రాకపోకలు సులభతరం కాలున్నాయి అని ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు అన్నారు. శుక్రవారం  ఆర్ అండ్ బి ఏ ఈ సత్యనారాయణ తో కలిసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు నిబంధనల కనుగుణంగా నాణ్యతగా చేపట్టాలని సూచించారు.

సంతాప సభను విజయవంతం చేయండి.. సర్పంచ్ అనసూర్యమ్మ

Submitted by shaikmohammadrafi on Sat, 24/09/2022 - 11:46

నడిగూడెం సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి ..///.  భూమికోసం ,భుక్తి కోసం ,పీడిత ప్రజల విముక్తి కోసం , జరిగిన  తెలంగాణ సాయుధ పోరాటానికి రాష్ట్ర కేంద్రంగా ఉండి ,  పుచ్చలపల్లి సుందరయ్య, నండూరి ప్రసాదరావు , భీమిరెడ్డి నరసింహారెడ్డి,మల్లు స్వరాజ్యం, మాకినేని బసవ పున్నయ్య,లావు బాలగంగాధర్ లాంటి అగ్ర నేతలకు, ఆశ్రయమిచ్చిన, ప్రాంతంసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం  రామాపురంలో సెప్టెంబర్ 24న జరిగే మాజీ సింగిల్ విండో చైర్మన్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు , రైతు బాంధవుడు , స్నేహశీలి, ప్రజల మనిషి, రాజకీయ వేత్త  అమరజీవి కీర్తిశేషులు భూతుకూరి పెద్ద వెంకటరెడ్డి  సంతాప సభను విజయవంతం చేయాలని  రామాపురం గ్రా

పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ నిత్యం కొనసాగాలి

Submitted by shaikmohammadrafi on Fri, 23/09/2022 - 11:47

నడిగూడెం ,సెప్టెంబర్ 22, ప్రజా జ్యోతి: మండలం లోని కరివిరాల మోడల్ స్కూల్ లో చైల్డ్ లైన్ ఆధ్వర్యం లో షీ టీమ్ & భరోసా వారి సహకారం తో  బాలల హక్కులు , సమస్యలు, రక్షణ మార్గాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల పరిరక్షణ అధికారి మల్లేష్ మాట్లాడుతూ.. పిల్లల పరిరక్షణ అందరి బాధ్యత, సోషల్ మీడియా ను అవసరమైన మేరకు మాత్రమే వినయోగించాలని ఆయన సూచించారు.సోషల్ మీడియా లో బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరం గా ప్రవర్తిస్తే షీ-టీమ్ వారిని సంప్రదించాలిని సూచించారు.

జాతీయస్థాయి అక్షర పురస్కారానికి ఎంపికైన సామినేని శ్రీనివాసరావు

Submitted by shaikmohammadrafi on Fri, 23/09/2022 - 09:47

నడిగూడెం, సెప్టెంబర్ 21, ప్రజా జ్యోతి: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జాతీయస్థాయి అక్షర పురస్కారాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడిగూడెంలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న సామినేని శ్రీనివాసరావు ఎంపికైనట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ యాస రామ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పు నాగయ్య, ప్రధాన కార్యదర్శి పాల్వాయి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం సూర్యాపేటలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జాతీయస్థాయి అక్షర పురస్కారం అవార్డు అందించనున్నట్లు తెలిపారు.

ఉన్నత శిఖరాలకు చేరుకోని ప్రాంతానికి పేరు తేవాలి... కళాశాల ప్రిన్సిపల్ సోమయ్య...

Submitted by shaikmohammadrafi on Wed, 21/09/2022 - 12:01

నడిగూడెం, సెప్టెంబర్ 20 ,ప్రజా జ్యోతి:  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  2022 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వృత్తి విద్య  ఇ టి గ్రూపు నందు విద్యనభ్యసించి వార్షిక పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన బొడ్డు లిఖిత్ ను మంగళవారం కళాశాలలో అధ్యాపక  బృందం  ఘనంగా సన్మానించడంతోపాటు షీల్డ్  ను అందజేశారు. కళాశాల  ఆధ్యాపకురాలు  సుజాత ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సోమయ్య మాట్లాడుతూ లిఖిత్ భవిష్యత్తులో  మంచి విద్యని అభ్యసించి ఉన్నత స్థాయిలో  పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరారు.