నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.ఎం.పి.పి యాతాకుల జ్యోతి మధుబాబు

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:44
Everyone should work for a vermin free society.M.P.P Yathakula Jyoti Madhubabu

నడిగూడెం, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి: నులిపురుగుల నిర్మూలన కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఎంపి.పి  యాతాకుల జ్యోతి మధుబాబు, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న తెలిపారు.నడిగూడెం  గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూచిన్నపిల్లలకు తరచుగా కడుపునొప్పి రావడం , ఏకాగ్రత లోపించడం వాటి కారణం కడుపు లోని నులిపురుగులని అన్నారు. నులి పురుగుల నిర్మూలన కొరకు 1 నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ నసీమా,  ఎంపీడీవో  ఎం. ఎర్రయ్య , ఉపాధ్యాయులు విద్యార్థులు , ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.