నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎం.పి.పి యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Thu, 15/09/2022 - 15:13
Everyone should strive for a vermin free society.  Jyoti Madhubabu of M.P.P.

నడిగూడెం, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి: నులిపురుగుల నిర్మూలన కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఎంపి.పి  యాతాకుల జ్యోతి మధుబాబు, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న కోరారు.నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలకు తరచుగా కడుపునొప్పి రావడం , ఏకాగ్రత లోపించడం వాటి కారణం కడుపు లోని నులిపురుగులు అని అన్నారు. నులి పురుగుల నిర్మూలన కొరకు ఒకటి నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ నసీమా,  ఎంపీడీవో  ఎం. ఎర్రయ్య , ఉపాధ్యాయులు విద్యార్థులు , ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..