నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Submitted by Upender Bukka on Thu, 15/09/2022 - 10:21
Everyone should work for eradication of worms

నడిగూడెం, సెప్టెంబర్ 14 ,ప్రజా జ్యోతి:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం పరిధిలోని 1 నుంచి 19 సంవత్సరాల బాల, బాలికలకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు బుధవారం సంబందిత వైద్య సిబ్బంది తో జరిగిన సమావేశంలో  మాట్లాడుతూచిన్నారులకు ఆల్బెండజోల్  ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఈనెల 15వ తారీకున నిర్వహించే  కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు ,అంగన్వాడీ, కార్యకర్తలకు సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. చిన్నారులలో రక్తహీనతకు  పాఠశాల మానివేయడానికి ముఖ్య కారణమైన నులిపురుగుల పట్ల చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  అన్ని పాఠశాలలలో నులిపురుగుల పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాగ మౌనిక, కళావతి ,విజయ్ కుమార్ , శైలజ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.