నడిగూడెం

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి

Submitted by Upender Bukka on Tue, 13/09/2022 - 20:15

నడిగూడెం, సెప్టెంబర్ 13, ప్రజా జ్యోతి:మోటర్లకు మీటర్లు పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు తిప్పి కొట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు.మంగళ వారం మండలంలోని వల్లపురం గ్రామంలో గ్రామ రైతు సంఘం మహాసభను  అమరగాని  గురవయ్య  అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ .రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియ పరుస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ  సందర్బంగా నూతన  గ్రామ శాఖను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కాసిం సాహెబ్, కార్యదర్శి గా ఎస్కే సైదా హుస్సేన్,  పది మంది  కమిటీ సభ్యుల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించినడివైఎఫ్ఐ నాయకులు

Submitted by Upender Bukka on Tue, 13/09/2022 - 20:12

నడిగూడెం, సెప్టెంబర్ 13, ప్రజా జ్యోతి మండలంలోని సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్ గౌడ్ కు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం తో  బృందావనపురం డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతను బృందావనపురం గ్రామంలో  శాలువాతో  ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ..... ఉపాధ్యాయులు నేటి భావితరాలను  తీర్చిదిద్దుటలో ప్రముఖ  పాత్ర వహించాలన్నారు.

మృతిరాలి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన మల్లన్న మిత్ర మండలి

Submitted by Upender Bukka on Tue, 13/09/2022 - 20:08

నడిగూడెం, సెప్టెంబర్ 13, ప్రజా జ్యోతి: మండలంలోని చాకిరాల గ్రామానికి చెందిన  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొడిశెట్టి గోవిందు సతీమణి పొడిశెట్టి మణెమ్మ  ఇటీవల  అకాల  మరణం చెందారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గోవిందు కుటుంబాన్ని  మల్లన్న మిత్రమండలి సభ్యులు మంగళవారం  కుటుంబ సభ్యులను పరామర్శించి  10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతల ఆంజనేయులు, బాణాల నాగరాజు, వెంకట నరసింహారెడ్డి, కొత్తపల్లి సుధాకర్, వట్టికూటి శ్రీను, నారాయణరెడ్డి, వేల్పుల కిరణ్. తదితరులు పాల్గొన్నారు.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

Submitted by Upender Bukka on Tue, 13/09/2022 - 20:05

నడిగూడెం, సెప్టెంబర్ 13 ,ప్రజా జ్యోతి  రాష్టం యూ టి యఫ్ పిలుపు మేరకు  మంగళవారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన
యూటియఫ్  సంఘ ప్రతినిధులను, నాయకులను ముట్టడికి వెళ్ళనీయకుండా  ముందస్తు అరెస్టు చేయటం  హెయమైన  చర్య అని  అన్నారు. అరెస్టు చేసిన  సందర్బంగా  కోదాడ పోలీస్ స్టేషన్ నుండి నాయకులు  మాట్లాడుతూ  ముందస్తు అరెస్టులతో   ఉద్యమాలను  ఆపలేరని ఉపాధ్యాయుల సమస్యలను  పరిష్కరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు.

అథ్లెటిక్స్ జూనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్

Submitted by Upender Bukka on Sat, 10/09/2022 - 18:03

నడిగూడెం, సెప్టెంబర్ 10, ప్రజా జ్యోతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం లోని గుంటూరు  జిల్లాలో సెప్టెంబర్ 9,10,11 తేదీలలో  నిర్యాహించిన   33 సౌత్ జోన్ జూనియర్స్ అండర్ 12 విభాగంలో అథ్లెటిక్స్  జాతీయ స్థాయి పోటీలలో  నడిగుడెం మండల కేంద్రానికి చెందిన చిత్తలూరి ప్రశంస తెలంగాణ రాష్టం నుండి పాల్గొని   ట్రాయాతలిన్  ఈవెంట్ లో  సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు శనివారం పత్రికా  విలేకరులకు  తెలిపారు.

కోదాడ ఎమ్మెల్యే తో మాకు ప్రాణ హాని ఉన్నది

Submitted by shaikmohammadrafi on Sat, 10/09/2022 - 13:22
  • ఆర్డర్ ఇవ్వకుండానే ట్రాక్టర్ హ్యాండ్ ఓవర్
  •  సర్పంచ్ నీ సస్పెండ్ చేపించి నా ఆగని ఎమ్మెల్యే వేధింపులు
  • రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు నాయ్యం చేయాలి

నడిగూడెం, సెప్టెంబర్ 8 ,ప్రజా జ్యోతి:  నీలిమ గాంధీ నడిగూడెం మండలం కరివిరాల గ్రామా సర్పంచ్ నీ తప్పుడు ఆరోపణల తో సస్పెండ్ చేపించిన కోదాడ ఎమ్మెల్యే కరివిరాల గ్రామ సర్పంచి గుర్రం నీలిమ గాంధీ ఇంటి మీదికి పోలీసుల్ని పంపించి భయభ్రాంతులకు గురి చేస్తు వేధింపులకు పాల్పడుతున్నాడు గ్రామ సర్పంచ్ నీలిమ గాంధీ సస్పెండ్ చేపించి మూడు నెలలు అవుతున్న నేటికీ వరకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను గ్రామ ఇంచార్జి సర్పంచ్ ల

తడి-పొడి పద్దతిలో వరిసాగు..

Submitted by shaikmohammadrafi on Sat, 10/09/2022 - 11:59
  • పర్యావరణానికిబాగు..
  •  ఎస్ వి ఎన్ ఆర్ డి ఎస్ డైరెక్టర్ గౌస్మియా.

నడిగూడెం, సెప్టెంబర్ 8, ప్రజా జ్యోతి: మండలంలోని రామాపురంలో  కోర్ కార్బన్ ఎక్సోల్యూషన్స్, స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ నల్లగొండ, వారు సంయుక్తంగా  వరిలో తడి- పొడి పద్దతి పై  అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ  సందర్బంగా ఎస్ వి ఎన్ ఆర్ డి ఎస్ డైరెక్టర్ గౌస్మియా   పాల్గొని మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడం వల్ల వ్యవసాయంలో నీటిసామర్థ యాజమాన్య పద్దతులను పాటించడం ఎంతో ఆవశ్యకమన్నారు.

రాజకీయ శక్తుల కుయుక్తులను విప్పి చెప్పిన జన చేతనకుడు కాళోజి. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Sat, 10/09/2022 - 11:42

నడిగూడెం, సెప్టెంబర్ 8 ,ప్రజా జ్యోతి:   మండల పరిషత్ కార్యాలయంలో  శుక్రవారం జరిగిన  కాళోజి  నారాయణరావు జయంతి కార్యక్రమం లో ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు అయన  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ  తెలంగాణ యాసను భాషను  సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి అని  బాసను అందలమెక్కించియాసకు పట్టంగట్టిన మహాకవి కాలోజీ నారాయణరావు రాజకీయ కుయుక్తులను విప్పిచెప్పి జనచేతన రగిలించినదార్శనీకుడు అక్షరాలను భావాలతో రాజేసిఆలోచనల అగ్గి పుట్టించింప్రజా చైతన్యమే లక్ష్యంగా

సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Sat, 10/09/2022 - 11:14

నడిగూడెం, సెప్టెంబర్ 8 ,ప్రజా జ్యోతి: నడిగూడెం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నందు  ఎంఈఓ సలీం షరీఫ్  ఆధ్వర్యంలో  గురువారం  నిర్యహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా   ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులే ప్రతి విద్యార్థిని సమాజంలో ఏ ఏ రంగాలకు తీసుకుపోవాలో నిర్ణయించే పరిశ్రమని కొనియాడారు.