ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట

Submitted by Upender Bukka on Sat, 17/09/2022 - 11:49
 CM KCR is big for public welfare

పేదింటి ఆడ పడుచులకు మేనమామ 

అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారుఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ 

నడిగూడెం, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి:తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం  నడి గుడెం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నడిగూడెం గ్రామానికి  నూతనంగా మంజూరైన కొత్త పింఛన్ కార్డులను, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను,  ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను  లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణి  చేశారు.అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10 లక్షల పింఛన్లతో  కలుపుకొని మొత్తం 46లక్షల మంది పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. నిర్లక్ష్యానికి గురయ్యే ఎంతో మంది వృద్ధులకు ఆసరా పింఛన్‌తో సీఎం కేసీఆర్‌  ఆత్మగౌరవాన్ని కల్పించామనితెలిపారు. ఆసరా పింఛన్‌తో లబ్ధి పొందుతున్న వృద్ధులు, వికలాంగులు సీఎం కేసీఆర్ గారిని ఓ పెద్ద కొడుకులా, పెద్దన్నలా భావిస్తున్నారన్నారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నాయకుడు సీఎం కేసీఆర్‌  చెప్పారు. సీఎం కేసీఆర్  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు అవాకలు,చవాకులుపేలుతున్నాయన్నారు . సీఎం కేసీఆర్ ఆసరాపింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలను బీజేపీ పాలితరాష్ట్రాల్లో ఉన్నాయ అని ప్రశ్నించారు. ఆ పార్టీలతో ఓరిగేదేమి లేదని.తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి, కేసీఆర్‌  పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులపై బేరీజు వేసుకోవాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఈ ఘనత గౌరవ సీఎం కేసీఆర్  దక్కుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో సైతం ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్  ఒక్కరేనని పేర్కొన్నారు. పల్లె దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేశామన్నారు. ఆసరా పెన్షన్ల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెన్షన్ డబ్బులు ఇస్తూ ఎక్కువ మందికి కూడా పెన్షన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించే బాధ్యత తమదన్నారు.

ఇంతటి అభివృద్ది చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి మీ నిండు ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరారు. నడిగూడెం మండల కేంద్రంలోని వివాహం చేసుకున్న యువతలకు  కళ్యాణ లక్ష్మి కింద లక్ష నూట పదహారు వేల రూపాయల  చెక్కును ఎమ్మెల్యే  స్వయంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.అనంతరం ఇటీవల కాలంలో మృతి చెందిన  టిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను   పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,  ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు,  జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు, సొసైటీ చైర్మన్లు పుట్ట రమేష్, రాజేష్,  స్థానిక సర్పంచి గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ మండల  పార్టీ అధ్యక్షులు పల్లా నర్సిరెడ్డి,ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవబత్తిని సురేష్ ప్రసాద్, పాలడుగు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు సర్పంచుల పోరం అధ్యక్షులు వెంకట  నరసయ్య, టిఆర్ఎస్ నాయకులు నల్లమల నాగేశ్వరరావు,ఖలీల్, జలీల్, కాసాని ఎంకన్న, బొల్లం శ్రీనివాస్, దాసరి  శ్రీను, పాతకోట్ల నాగేశ్వరరావు, కాసని పుల్లయ్య, భువనగిరి ఉపేందర్,  ,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో, తాసిల్దార్,ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.