Mulugu district

కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ 127వ జయంతి కార్యక్రమం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:52

ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజా జ్యోతి): తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్పూర్తి ప్రధాయులని,ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపట్టానికి కలెక్టర్ పూల మాలవేసి నివాళులర్పించారు.

ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 14:11

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి):  ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ములుగు జిల్లా 2వ మహాసభ నీలదేవి, ప్రభావతి అధ్యక్షతన శనివారం జరిగింది.

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:53

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమం క్యాచ్ ద రేన్,వేర్ ఇట్ ఫాల్స్,  వెన్ ఇట్ ఫాల్స్ పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ లైవ్లీ హుడ్ అర్బన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ ఎఫైర్స్ జలశక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమార్  పేర్కొన్నారు.శుక్రవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు క్రిష్ణ అదిత్య, భవేష్ మిశ్రా,ఐటిడిఏ పిఓ అంకిత్,రవి టెక్నికల్ ఆఫీ

ములుగు నూతన సిఐ బాధ్యతలు స్వీకరణ

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:34

ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజా జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహించిన గుంటి శ్రీధర్ ఇటీవల హైదరాబాద్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో నూతన సిఐ రంజిత్ కుమార్ పగిలిపై వచ్చారు.కాగా నూతన సిఐ రంజిత్ కుమార్ శుక్రవారం ములుగు పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనను ములుగు ఎస్సైలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌ - కర్ర‌తో కొట్ట‌డంతో త‌మ్ముడి మృతి

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:07

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి):  అన్నదమ్ములకు మొద‌లైన గొడ‌వ త‌మ్ముడి ప్రాణాల‌ మీదికి తెచ్చింది.కోపం ప‌ట్ట‌లేక అన్న త‌న త‌మ్ముడిని కొట్టడంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు.ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బుధవారం రాత్రి జరిగింది. కమలాపురంలోని అల్లూరి సీతారామరాజు వీధి (చెరువుకట్ట ఏరియా)కు చెందిన మునుకుంట్ల సంపత్ మునుకుంట్ల శేఖర్ ఇద్దరు అన్నదమ్ములు బుధవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.అది కాస్తా ముదరడడంతో కోపోద్రికుడైన అన్న మునుకుంట్ల సంపత్ త‌న తమ్ముడు శేఖర్ ముఖంపై కర్రతో గ‌ట్టిగా కొట్టాడు.

గర్భిణులు పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి - సిడిపిఓ గొర్ల మల్లేశ్వరి

Submitted by Srikanthgali on Tue, 13/09/2022 - 13:20

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి):  గర్భిణులు ప్రతీరోజు అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్నం వేళ పోషక విలువలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ తాడ్వాయి సిడిపిఓ గొర్ల మల్లీశ్వరి అన్నారు.సోమవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి అంగన్ వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ మల్లీశ్వరి హాజరై మాట్లాడారు.గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరీక్షలను నిర్వహించుకోవాలని అన్నారు.గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడం సురక్షితమని తెలిపారు.

అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు లు ఇవ్వాలి

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:59


వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి) మండల కేంద్రంలో వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలోసిపిఎం పార్టీ కార్యాలయం లో మండల కమిటీ సమావేశం గ్యానంవాసు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి  పార్టీ రాష్ట్ర కంట్రోలర్ కమీషన్ చైర్మన్ భద్రాచలం మాజీ ఎంపీ  మిడియంబాబురావు హాజరయ్యారు.ఈసందర్భంగావారు మాట్లాడుతూ  మండలంలో గోదావరి ముంపు బాధితులకు ఇంత వరకు సరిగా నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. అంతేకాకుండా సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇచ్చే దళితులకు దళితభందు సక్రమంగా దళితులకు ఇవ్వాలని అన్నారు,

ప్రజా జ్యోతి కధనం కు స్పందన కదిలిన రెవెన్యూ శాఖ

Submitted by sridhar on Mon, 12/09/2022 - 15:44

వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి) ములుగు జిల్లా, వెంకటాపురం మండల పరిధిలోని బర్లగూడెం గ్రామ పంచాయతీ చిన్న గంగారం గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.ఆదివారం వేకువజామున ఇంట్లో నిద్రిస్తున్న మొడెం సమ్మక్క బయటకు పరుగులు తీసి ప్రాణాపాయం నుండి బయట పడింది.నిరుపేద ఐన సమ్మక్క తనకు న్యాయం చేయాలని బాధితురాలు  ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.అనే కధనం ప్రజా జ్యోతి దినపత్రిక లో సోమవారంప్రచురితమైనది.పాఠకులకు విధితమే.

స్పందించిన తహశీల్దార్ ఆంటీ నాగరాజు