కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ 127వ జయంతి కార్యక్రమం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:52
Chakali Ailamma 127th birth anniversary program at Collectorate

ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజా జ్యోతి): తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్పూర్తి ప్రధాయులని,ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపట్టానికి కలెక్టర్ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ    తెలంగాణ వీర వనిత వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ,సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 26,1895న జన్మించిందని తెలిపారు.  అగ్రకులాల స్త్రీలు,దొరసానులు తమను కూడా దొర అని ఉత్పత్తికులాల (బిసి కులాల)చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారని,ఈ భూమినాది, పండించిన పంటనాది,తీసుకెళ్లడానికి దొరెవ్వడు,నా ప్రాణం పోయాకే ఈ పంట,భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మని ఆయన తెలిపారు.అనేక సమస్యలు ఎదుర్కొంటు నమ్మిన సిద్ధాంతం కోసం కృషి చేసిందని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి లక్ష్మణ్,కలెక్టరేట్ ఏఓ విజయభాస్కర్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గోన్నారు.