గర్భిణులు పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి - సిడిపిఓ గొర్ల మల్లేశ్వరి

Submitted by Srikanthgali on Tue, 13/09/2022 - 13:20
 Pregnant women should eat nutritious food - CDPO Gorla Malleswari

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి):  గర్భిణులు ప్రతీరోజు అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్నం వేళ పోషక విలువలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ తాడ్వాయి సిడిపిఓ గొర్ల మల్లీశ్వరి అన్నారు.సోమవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి అంగన్ వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ మల్లీశ్వరి హాజరై మాట్లాడారు.గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరీక్షలను నిర్వహించుకోవాలని అన్నారు.గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడం సురక్షితమని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రంలో 9 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం చేయడం సంతోషించ తగ్గ విషయమని సర్పంచ్ వీసం సమ్మయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి,ఎంపీటీసీలు నాగలక్ష్మి,ఉమాదేవి, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.