పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:12
The objective of the government is to provide nutritious food.

గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి.ఉపసర్పంచ్ రమేష్.

 నర్సింహులపేట , సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి '''/   పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం,గర్భిణీలు బాలింతలుపౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి ఉపసర్పంచ్ రమేష్. గురువారం  బొజ్జన్న పేట అంగనవాడి సెంటర్లు   1,2,3 మరియు భీమ్లా తండా  అంగన్వాడి సెంటర్లోపిల్లలకు అక్షరాభ్యాసం చేశారు .తల్లి బిడ్డల ఆరోగ్యానికి శిశువు సంపూర్ణ వికాసానికి పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర  ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రత్యేకంగా  అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పప్పు దినుసులు,నూనె  సంపూర్ణ పౌష్టికాహారాన్ని  అందించడం జరుగుతుందని గ్రామ ఉప సర్పంచ్ రాంపెల్లి రమేష్  అన్నారు. అనంతరం  అంగన్వాడి కేంద్రంలో పోషకాహారలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా  ఉప సర్పంచ్ రాంపెల్లి రమేష్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రోజు వచ్చి పౌష్టికాహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పుట్టే శిశువు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన అన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఒకపూట పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారనిఅయన తెలిపారు తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం లో గర్భిణీలు బాలింతలు కు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం పై మహిళలు  హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంపెల్లి రమేష్  అంగన్వాడీ టీచర్లు రమ, వెంకటలక్ష్మి,,యకమ్మ అంగన్వాడి ఆయాలు మహిళలు, పిల్లలు, ఇసం పెళ్లి ఉప్పలయ్య  తదితరులు పాల్గొన్నారు.