పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Submitted by veerareddy on Tue, 13/09/2022 - 13:04
Pending applications should be dealt with promptly

- ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  క్రిష్ణ ఆదిత్య 

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్12 (ప్రజా జ్యోతి): పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య అధికారులు ఆదేశించారు. సోమవారం ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.దరఖాస్తుదారుల నుండి జిల్లా కలెక్టర్ నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.మొత్తం 39 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ వివిధ శాఖలో పెండింగ్లో ఉన్న పనుల సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యశాఖ మెడిసిన్ కొరత లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

వెంకటాపురం మండలం ఎదిరా ప్రాథమిక పాఠశాల భవనం శిథిల వ్యవస్థలో ఉన్నందున పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయాలని నీటి కొరత లేకుండా చూడాలన్నారు.పరిశ్రమల శాఖ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు రుణాలు అందించాలని పరిశ్రమల జిల్లా అధికారిని  ఆదేశించారు.రోడ్డు మరమత్తు పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి,పిఆర్ శాఖల అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్,డిఆర్ఓ కే.రమాదేవి,వైద్యాధికారి అప్పయ్య,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్ కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్,డిడబ్లూఓ ప్రేమలత,బిసి సంక్షేమ అధికారి లక్ష్మణ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.