Mulugu district

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన భాజపా నాయకులు

Submitted by sridhar on Tue, 06/09/2022 - 18:19

వాజేడు, సెప్టెంబర్ 6, ప్రజాజ్యోతి: వాజేడు మండలంలోని చింతూరు గ్రామానికి చెందిన తోటపల్లి రమేష్, స్వరూప దంపతులు రెండు రోజుల క్రితం మండలంలోని సుందరయ్య కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసినదే ఐతే మంగళవారం భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీష్ కుమార్ వాజేడు మండల భాజపా నాయకులతో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించి ఆకుటుంబానికి 25 కేజీల బియ్యం, రెండువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

లారీ, ద్విచక్ర వాహనం డీ ఘటనలో భార్యాభర్తలు దుర్మరణం

Submitted by sridhar on Sun, 04/09/2022 - 17:47

వాజేడు, సెప్టెంబర్ 4, ప్రజాజ్యోతి: లారీ ద్విచక్ర వాహనం ఢీకొని భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామా సమీపంలోని 163 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

Submitted by Sathish Kammampati on Tue, 30/08/2022 - 18:22
  • ప్రమాదాలు జరుగే ప్రదేశాలలో సైన్ బోర్డులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
  • ఇసుక ఓవర్ లోడ్ లారీలను చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీ చేయాలి
  • రవాణా సంస్థ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య

ములుగు జిల్లా ప్రతినిధి,ఆగష్టు 30(ప్రజా జ్యోతి): జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించాలని అందుకు తగిన చర్యలు చేపట్టాలని రవాణా సంస్థ పంచాయతీ రాజ్,ఆర్అండ్ బి,పోలీస్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్  క్రిష్ణ ఆదిత్య పలు సూచనలు చేశారు.

పేద ప్రజల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది: మంత్రి

Submitted by Ashok Kumar on Tue, 30/08/2022 - 11:07

పేద ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ల కార్డుల జారీ కార్యక్రమంలో 9  మండలాలకు చెందిన 8 వేల 424మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 33 వేల 179 పెన్షనర్లు ఉండగా,కొత్తగా 8424 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని,ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా ప