ప్రజా జ్యోతి కధనం కు స్పందన కదిలిన రెవెన్యూ శాఖ

Submitted by sridhar on Mon, 12/09/2022 - 15:44
Response to Praja Jyoti Kadhanam

వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి) ములుగు జిల్లా, వెంకటాపురం మండల పరిధిలోని బర్లగూడెం గ్రామ పంచాయతీ చిన్న గంగారం గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.ఆదివారం వేకువజామున ఇంట్లో నిద్రిస్తున్న మొడెం సమ్మక్క బయటకు పరుగులు తీసి ప్రాణాపాయం నుండి బయట పడింది.నిరుపేద ఐన సమ్మక్క తనకు న్యాయం చేయాలని బాధితురాలు  ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.అనే కధనం ప్రజా జ్యోతి దినపత్రిక లో సోమవారంప్రచురితమైనది.పాఠకులకు విధితమే.

స్పందించిన తహశీల్దార్ ఆంటీ నాగరాజు

క్షేత్ర స్థాయిలో సంభందిత సర్పంచ్ కోర్సా నరసింహ మూర్తి , కార్యదర్శి మౌనిక తో కలిసి పంచనామా నిర్వహించి తహశీల్దార్ విచారణ చేపట్టారు.భారీ వర్షాలకు ఆదివారం తెల్లవారుజామున మోడెం సమ్మక్క నివాస గృహాం పెంకిటిల్లు పూర్తి స్థాయిలో కూలిపోయింది.భాధితురాలుకు ఆర్థిక సహాయం కోసం టిఆర్ఎఫ్ క్రింద ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కి నివేదిక పంపించామని తహశీల్దార్ తెలిపారు.