భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:53
The aim is to increase the groundwater level

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమం క్యాచ్ ద రేన్,వేర్ ఇట్ ఫాల్స్,  వెన్ ఇట్ ఫాల్స్ పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ లైవ్లీ హుడ్ అర్బన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ ఎఫైర్స్ జలశక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమార్  పేర్కొన్నారు.శుక్రవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు క్రిష్ణ అదిత్య, భవేష్ మిశ్రా,ఐటిడిఏ పిఓ అంకిత్,రవి టెక్నికల్ ఆఫీసర్ సెంట్రల్ వాటర్ కమిషన్,బారిక్ జిపిఎంఓ కన్సల్టెంట్, రెండు జిల్లాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ములుగు డిఎఫ్ఓ లావణ్య, భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర్,డిఆర్ఓ రమాదేవి,సీఈఓలు,డిఆర్డిఓలు, డిపిఓలు,డిఏఓలు, ఎపిడిఓలు,ఎంపిడిఓలు,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.